పోసానికి తీవ్ర అస్వస్దత ఇలా అయిపోయాడేంటి..?
పోసానికి తీవ్ర అస్వస్దత:
రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్దతతకు గురైయ్యారు. రాజంపేట ప్రభుత్వాసుపత్రి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు పోసానిని తరలించారు. నారా లోకేష్ ,పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నారా లోకేష్,పవన్ కళ్యాణ్ ను వ్యక్తిత దూషించారనే కేసులో అరెస్టై రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్దతకు గురైయ్యారు. సబ్ జైలు నుండి వెంటనే సమీపంలోని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలిచారు. వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈసీజీ టెస్ట్ లో స్వల్ప తేడాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. రాజంపేట నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు.ఈ సందర్భంగా పోసానిని కలిసేందుకు వచ్చిన వైసిపి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.





















