KTR : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
Cricket : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. భారతీయునిగా ఈ పని చేస్తున్నాన్నారు.

KTR apology: కేటీఆర్ క్షమాపణలు చెప్పారు. కేరళకు చెందిన షామా మహమ్మద్ అనే మహిళా కాంగ్రెస్ నేత రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉన్నాడని.. ఆయన కెప్టెన్సీ ఆకట్టుకునేలా లేదని ట్వీట్ చేశారు. కాసేపటికి ట్వీట్ డిలీట్ చేశారు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెపై నెటిజ్లు విరుచుకుపడుతున్నారు. ఆమె మాటలు కాంగ్రెస్ అన్నట్లుగానే భావిస్తున్నారు. కేటీఆర్ కూడా అదే విదంగా తీసుకుని ట్వీట్ పెట్టారు.
రోహిత్ శర్మపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదని.. బాడీ షేమింగ్, అవమానకరమైన వ్యాఖ్యలు భ్రాంతికరమైన ప్రకటనలు కాంగ్రెస్ ముఖ్య లక్షణమన్నారు. అలాంటి మాటలకు ఓ భారతీయుడిగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఆ క్షమాపణలు రోహిత్ శర్మకా.. లేకపోతే షామా మహమ్మద్ వద్ద మనోభావాలు గాయపర్చుకున్న వారికా అన్నది స్పష్టత లేదు. నిజానికి రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ షామా మహమ్మద్ చేసిన ట్వీట్ మాత్రమే వైర్ల అవుతోంది.
రాజకీయాల్లో క్షమాపణలు చెప్పడం కూడా ఓ రకమైన రాజకీయ వ్యూహమే. ఎవరో అన్నదానికి క్షమాపణలు చెప్పడం అంటే.. ఆ పనులు చేసిన వారిని టార్గెట్ చేసినట్లుగా ఉంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో కేటీఆర్ ఓ అడుగు ముందుకేశారు. తెలంగాణకు సంబంధమే లేని అంశంలో క్షమాపణలు చెప్పారు.
I don’t see a reason why many are getting riled up over Congress spokesperson’s comments on Rohit Sharma?!
— KTR (@KTRBRS) March 4, 2025
Body shaming, derogatory comments and delusional statements are a hallmark of Congress
To think Rohit Sharma needs fitness advice or sermons on achievements from a…
షామా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ యువనేతగా ఉన్నారు. కేరళకు చెందిన ఆమె .. చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడుతూంటారు. అయితే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. రోహిత్ శర్మ ఫిట్నెస్ పై చాలా మందిమాట్లాడుతూ ఉంటారు. అయితే షామా మహమ్మద్ చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అయింది. ఈ కారణంగా ఆమె తొలగించారు. అయితే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో తాను తగ్గేది లేదంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నైజమే అంతని.. అందర్నీ కించ పరుస్తూ ఉంటారని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. ఈ వ్యవహారం మెల్లగా కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటోంది. అయితే ఇంకా ఆ పార్టీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. షామా మహమ్మద్ వ్యాఖ్యలు తప్పో ఒప్పో స్పందించలేదు.
Also Read: రోహిత్ శర్మ ఫ్యాట్ - కాంగ్రెస్ మహిళా నేత బాడీ షేమింగ్ - సోషల్ మీడియాలో దుమారం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

