Shama Vs Sharma: రోహిత్ శర్మ ఫ్యాట్ - కాంగ్రెస్ మహిళా నేత బాడీ షేమింగ్ - సోషల్ మీడియాలో దుమారం
Shama Mohammed: రాజకీయ నేతలు జాగ్రత్తగా కామెంట్లు చేయాలి. వ్యక్తుల్ని కించ పర్చకూడదు. కానీ ఓ కాంగ్రెస్ మహిళ నేత రోహిత్ శర్మ బాడీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Rohit Sharma: కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత షామా మహమ్మద్ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కు పాల్పడటం వివాదాస్పదం అవుతోంది. రోహిత్ ను లావుగా ఉంటాడు.. చెత్త కెప్టెన్ అని అభివర్ణించింది. అతని కెప్టెన్సీ వర్కవుట్ కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంతో షామా మహమ్మద్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ ను తొలగించారు.
ये दो कौड़ी की भाँड बताएगी की कौन फिट है और कौन नही 😂😂 #ShamaMohammed 🖕#RohitSharma𓃵 pic.twitter.com/FFZisu79hH
— Gaurav singh (@Gaurav_Bisht1) March 3, 2025
షామా మహమ్మద్ చేసిన ట్వీట్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ ఫిట్‌నెస్, కెప్టెన్సీకి మద్దతుగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది రోహిత్ ఫిట్‌నెస్ పై కూడా కొంత మంది ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడుతూ .. షామా మహమ్మద్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. తన ట్వీట్ డిలీ చేసినా.. అదే మాటలు చెబుతున్నారు.
भारतीय संघाने चॅम्पियन्स ट्रॉफी स्पर्धेच्या अखेरच्या साखळी सामन्यात न्यूझीलंडविरुद्ध 44 धावांनी विजय मिळवला. मात्र, या सामन्यानंतर काँग्रेस नेत्या डॉ. शमा मोहम्मद यांनी रोहित शर्माबद्दल वादग्रस्त वक्तव्य केलं.#RohitSharma #INDvsNZ #ShamaMohammed pic.twitter.com/M74H68YChp
— SakalMedia (@SakalMediaNews) March 3, 2025
ఈ వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చి చొరబడ్డాయి. టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ షామా మహమ్మద్ వ్యాఖ్యలను సమర్థించారు. రోహిత్ శర్మ ఫిట్ గా ఉండాలన్నారు.
Shama Md is right, Rohit Sharma should be kicked out of the team - TMC MP Saugata Roy
— Indian Cricket Fc (@Jonathan_fcc) March 3, 2025
Why are they discussing this?#RohitSharma #ShamaMohammed #ChampionsTrophy2025 pic.twitter.com/1n1pcHUQcx
కొంత మంది ఈ వివాదాన్ని రాహుల్ గాంధీకి ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారు.
Who is Rahul Gandhi?
— Mohit Sharma (@Awara013) March 3, 2025
Just a leader of political party
Who is Rohit Sharma?
A World Cup winning captain, who is officially representing India on World stage
A great leader vs a Pappu who lost 40 elections #ShamaMohammed #RohitSharma𓃵 pic.twitter.com/J8L886NiE8
సద్విమర్శలు చేయవచ్చు కానీ బాడీ షేమింగ్ కు పాల్పడటం మంచిది కాదని పలువురు సూచిస్తున్నారు. టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయ నతలు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియా షామా వర్సెస్ శర్మ అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.





















