అన్వేషించండి

Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్

Maharashtra Election 2024: మహారాష్ట్ర ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 288 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో మహయూతి కూటమి, మహా వికాస్ అఘడీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు తెలనున్నాయి.

Maharashtra Assembly Elections Polling : మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. మరాఠా ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రలో 288 శాసన సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాలకు ఒకే విడతగా ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. నవంబర్ 23న మరాఠా ఓటరు తీర్పు వెలువడనుంది.  

మహారాష్ట్రలో 288 స్థానాల్లో 9,63,69,410 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కొనసాగుతోంది. సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రెండు కూటముల అభర్థుల కాకుండా 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 

రెండు కూటములు ఇక్కడ తమ బలాబలాను తేల్చుకోనున్నాయి. కమలం పార్టీ పెద్దన్నగా ఉన్న కూటమి మహాయుతి, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి మహావికాస్ అఘాడి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతి కూటమిలో బీజేపీ, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ, ఏక్‌నాథ్ శిండే ఆధ్వర్యంలోని శివసేన సహా మరో 8 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 

మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ,  ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేనతోపాటు మరి కొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్ర పీఠం దక్కాలంటే 288 నియోజకవర్గాల్లో 145 సీట్లు గెల్చుకోవాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా హోరా హోరీ రెండు కూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. 

ఓటరుకు కూటమి వరాల వర్షం
మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచిత కానుకల వర్షం కురిసింది. మహయుతి కూటమి, మహా వికాస్ అఘాడీ రెండూ పోటీ పడి వరాల జల్లు కరిపించాయి.  రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతను ఆకర్షించే విధంగా తమ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించాయి. 

మహాయుతి హమీలు:

  • లడ్కీ బెహన్‌ స్కీమ్‌’ కింద ప్రస్తుతం మహిళలకు ప్రతి నెల ఇస్తున్న రూ.1500ను రూ.2100కు పెంచడం
  • 2027 కల్లా 50లక్షల మంది మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడం.
  • వృద్ధాప్య పింఛన్లు రూ.2,100కు పెంచడం
  • పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతకు నైపుణ్య శిక్షణ
  • 25 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన
  • 20 లక్షల మంది విద్యార్థులకు ప్రతీ నెల .10 వేల చొప్పున స్టైపండ్‌
  • ప్రజలకు ఆరోగ్య బీమా భద్రత కల్పించడం
  • రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, ఎరువులపై ఎస్‌జీఎస్టీ తిరిగి చెల్లించడం.
  • విద్యుత్తు బిల్లులను 30 శాతం మేర తగ్గించేందుకు చర్యలు, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి.
  • అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ‘విజన్‌ మహారాష్ట్ర 2028’ విడుదల

మహా వికాస్ అఘాడీ హామీలు ఇవే:

  • మహిళలకు ఏటా రూ.500కే ఆరు గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ
  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నిరోధానికి 9-16 సంవత్సరాల వయసుగల బాలికలకు ఉచితంగా టీకాల పంపిణీ
  • రాష్ట్రంలో కులగణన
  • రుతు స్రావ సమయంలో మహిళా ఉద్యోగులకు రెండు ఐచ్ఛిక సెలవులు 
  • మహిళల భద్రతకు ‘నిర్భయ్‌ మహారాష్ట్ర’ పాలసీని తయారుచేసి అమలు చేయడం
  • 18 ఏళ్ల బాలికలకు రూ.లక్ష ఆర్థిక సాయం
  • 3 లక్షల వరకు రైతు రుణమాఫీ. 
  • నిరుద్యోగులైన పట్టభద్రులకు నెలకు రూ.4 వేల జీవన భృతి
  • 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
  • ప్రతినెలా 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు.

ఉచిత వరాలతో రెండు కూటములు పోటా పోటీగా ప్రచారం నిర్వహించి మరాఠా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.

రెండు కూటముల కన్ను ఈ ప్రాంతాల పైనే...
మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలు ముంబై, ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర,  కొంకణ్, విదర్భ, మరట్వాడా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల వారీగా రెండు కూటములు ఎక్కువ స్థానాలను గెల్చుకుని అధికార పీఠం దక్కించునేలా వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మహారాష్ట్రలో కీలమైన సిటీ ముంబయి పరిధిలోను, దాని శివారు ప్రాంతాలు కలుపుకుంటే 36 నియోజకవర్గాలు ఉన్నాయి. చివరిగా జరిగిన లోక్ సభ ఎన్నికలు పరిశీలిస్తే 9 పార్లమెంట్ స్థానాల్లో మహయుతి కూటమి ఆరు స్థానాలు గెల్చుకోగా,  ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు గెల్చుకుంది. ఈ దఫా ఈ లెక్క మార్చాలని రెండు కూటములు పట్టుదలతో ఉన్నాయి. 

పశ్చిమ మహారాష్ట్రలో రైతుల ప్రభావం ఎక్కువ. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు పార్లమెంట్ స్థానాలకుగాను ఆరింటిని మహావికాస్ అఘాడీ కూటమి గెల్చుకోగా, బీజేపీ ఒక్క స్థానం గెల్చుకుంది. రైతు వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వంపై పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. ఈ దఫా ఆ వ్యతిరేకతను పోగొట్టుకుని ఎక్కువ స్థానాలు గెల్చుకునేందుకు మహయుత కూటమి ప్రయత్నిస్తుండగా, మహా వికాస్ అఘాడీకూటమి పట్టు నిలుపుకునేందుక సిద్ధమవుతోంది. 

గత ఎన్నికల్లో మరట్వాడా ప్రాంతంలో ఏడు పార్లమెంట్ స్థానాలకు ఆరింటిని మహా వికాస్ అఘాడీ కూటమి దక్కించుకుంది. ఒక్క స్థానాన్ని శిండే ఆధ్వర్యంలోని శివసేన గెల్చుకుంది. ఇక్కడ మరాఠాలను ఓబీసీలో చేర్చాలన్న ఉద్యమం తీవ్రంగా జరిగింది.  ఇది పార్లమెంట్ ఎన్నికల్లో శిందే ప్రభుత్వానికి దెబ్బ తీసిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు.

విదర్భ మహారాష్ట్రలో వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తింపు ఉంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ సెంటిమెంట్ ఇక్కడి ప్రజల్లో ఉంది. దీనికి బీజేపీ మద్ధతు ప్రకటించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పది పార్లమెంట్ స్థానాల్లో ఏడింటిని మహా వికాస్ అఘాడీ కూటమి గెల్చుకుంది. ఇందులో కాంగ్రెస్ 5 స్థానాలు గెల్చుకోవడం విశేషం. మిగతా మూడు స్థానాలు శిందే కూటమి గెల్చుకుంది. ఇక్కడ పట్టు నిలుపుకోవడానికి రెండు కూటములు తీవ్రంగా పోరాడుతున్నాయి. 

కొంకణ ప్రాంతంలో ఆరు పార్లమెంట్ స్థానాల్లో అధికార మహయుతి కూటమి ఐదింటిని గెల్చుకుని మహా వికాస్ అఘాడీపై ఆధిక్యం చూపించింది ఇక్కడే. ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు మహా వికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తోంది. అందుకు చత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసం జరిగిన వైనాన్ని ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లి సెంటిమెంట్‌తో చెక్ పెట్టాలని చూస్తోంది. శిందే సర్కార్ తన తన బలం సన్నగిల్లకుండా ఉండేందుకు కొంకణ ప్రాంతంలో కొంకణ్ పోర్టు, మల్టీ మోడల్ కారిడార్, మెగా రిఫైనరీ వంటి భారీ ప్రాజెక్టులు ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

పశ్చిమ మహారాష్ట్రలో పది పార్లమెంట్ స్థానాల్లో ఐదింటిని మహా వికాస్ అఘాడీ గెల్చుకోగా, మహయూతి కూటమి నాలుగు స్థానాలను గెల్చుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మరో స్థానంలో గెలిచారు. ఇక్కడ హోరాహోరీగా రెండు కూటములు ఆధిక్యం కోసం పోరాడుతున్నాయి. ఈ ప్రాంతంలో బాబాయి అబ్బాయి అయిన శరద్ పవార్, అజిత్ పవార్ బల ప్రదర్శన చేశారు. ఏది ఏమైనా పెద్దఎత్తున ఈ ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్లు గెల్చుకుని మహారాష్ట్ర పీఠం దక్కించుకోవాలని ఇరు కూటములు సర్వశక్తులొడ్డుతున్నాయి.

మహారాష్ట్ర ప్రాంతాల వారీగా సీట్లు: 
పశ్చిమ మహారాష్ట్ర - 70 సీట్లు
విదర్భ - 62సీట్లు
మరాఠ్వాడా - 46సీట్లు
కొంకణ్ థానే - 39సీట్లు
ముంబై - 36సీట్లు
ఉత్తర మహారాష్ట్ర - 35సీట్లు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019, పార్టీల వారీగా ఫలితాలు
బీజేపీ - 105 సీట్లు
శివసేన - 56 సీట్లు
జాతీయవాది - 54 సీట్లు
కాంగ్రెస్ - 44సీట్లు
బహుజన్ వికాస్ అఘాడి – 03 సీట్లు
ప్రహర్ జన్ శక్తి – 02 సీట్లు
MIM - 02 సీట్లు
సమాజ్‌వాదీ పార్టీ - 02 సీట్లు
MNS - 01 
సిపిఐ - 01
జాన్సురాజ్ శక్తి – 01
విప్లవ రైతు పార్టీ - 01
షేకప్ - 01
రాస్ప్ - 01
స్వాభిమాని - 01
స్వతంత్రం – 13
మొత్తం – 288 

మహాయుతి – 162
బీజేపీ(105), శివసేన (56), RSP (01), RIP, ర్యాత్ క్రాంతి సంఘ్‌(0), శివ సంగ్రామ్(0)

మహా కూటమి - 105 
NCP (54), కాంగ్రెస్ (44), బహుజన్ వికాస్ అఘాడి (03), షేకప్ (01), స్వాభిమాని (01), సమాజ్‌వాదీ పార్టీ (02)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Mahindra Scorpio: స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
Embed widget