Saif Ali Khan Attack - Daya Nayak: సైఫ్ పై హత్యాయత్నం కేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దర్యాప్తు - జేబులో గన్నుతో దయా నాయక్ ఎంట్రీ !
Daya Nayak: ముంబైలో సైఫ్ అలీఖాన్ పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు చేయడానికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ తెరపైకి వచ్చారు. దీంతో కేసు త్వరగా సాల్వ్ అయిపోతుందని భావిస్తున్నారు.
Saif Ali Khan Stabbed: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన హత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో అసలు ఏం జరిగిందన్నది సస్పెన్స్ గా మారింది. సైఫ్ పదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. అన్ని అంతస్తులు దాటుకుని అతను పైకి ఎలా వెళ్లాడు.. ఎలా తప్పించుకున్నాడు అన్న దగ్గర నుంచి అనేక అనుమానాలు ఈ కేసులో ఉన్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు అధికారిగా .. దయానాయక్ ను రంగంలోకి దింపారు.
సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద పోలీసు ఆఫీసర్ దయానాయక్ కనిపించడంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఆయన జేబులో గన్నుతో ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. ఆయన ఎన్ కౌంటర్ స్పెషలిస్టు. నేరస్తుల్ని పట్టుకోవడం కన్నా ఎన్ కౌంటర్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. అలాగే కేసుల దర్యాప్తులోనూ కీలకంగా ఉంటారు. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వారెవరో తేల్చేందుకు ఆయన రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram
దయానాయక్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు. నేరస్తులను .. మాఫియా గ్యాంగుల్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారు. దాదాపుగా ఎనభై ఎన్ కౌంటర్లు చేశారని చెబుతారు. ఆయన కర్ణాటకలో పుట్టిన కన్నడిగుడు. అయితే చిన్న వయుసలోనే ముంబై వచ్చేసి అక్కడే పని చేసుకుంటూ చదువుకున్నాడు. మొదటి నుంచి పోలీసు ఆఫీసర్ అవ్వాలన్న టార్గెట్ తో చదువుకున్నాడు. అనుకున్నట్లుగానే సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ఓ ప్యాషన్ తో ఆయన చేసే ఉద్యోగం కారణంగా క్రమంగా పైకి ఎదిగారు. కెరీర్ తొలి నాళ్లలోనే ఇద్దరు చోటా రాజన్ గ్యాంగ్ సభ్యుల్ని ఎన్ కౌంటర్ చేయడంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత రౌడీలకు ..మాఫియా గ్యాంగులకు దయానాయక్ అంటే దడ పుట్టేలా పని చేశారు.
దయానాయక్ దడపుట్టించే తీరువల్ల ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సిద్దం చేసిందేనని చెబుతారు.ఎందుకటే దయానాయక్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగానే కాదు.. ఆయనపై అక్రమాస్తుల కేసులు కూడా ఉన్నాయి. ఓ సారి అరెస్టు చేశారు కూడా. తర్వాత మళ్లీ సర్వీసులోకి వచ్చారు. అయితే ఆయన దర్యాప్తు చేసిన కేసుల్ని సులువుగా చేధించేస్తారని అంటున్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద ఆయన కనిపించిన స్టైల్ చూస్తే.. దాడి చేసిన వారి ఎన్ కౌంటర్ ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్యాంట్ జేబులోనే ఆయన తుపాకీ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ కనిపించారు.