OTP Traceability: OTPలు లేటవ్వొచ్చు కానీ దొంగల చేతికి చిక్కరు - డిసెంబర్ 1 నుంచి సైబర్ నేరాల నుంచి కొత్త సెక్యూరిటీ ఫీచర్
Delay in OTPs: డిసెంబర్ ఒకటి నుంచి అన్ని టెలికాం సంస్థలు ట్రేసబులిటీ సిస్టమ్ ను అమలు చేయనున్నాయి. దీని వల్ల మెసెజులు ఆలస్యమవుతాయని జరుగుతున్న ప్రచారాన్ని ట్రాయ్ తోసిపుచ్చింది.
Trai New traceability rules: ఆన్ లైన్ మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి వ్యవస్థలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.అందులో భాగంగా కొత్తగా టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ .. టెలికాం కంపెనీలకు కొత్త రూల్ బెట్టింది. ట్రేస్‌బిలిటీ సిస్టమ్ అమలు చేయాలని అమలు చేయాలని ఆదేసించిది. ఈ సిస్టమ్ ను డిసెంబర్ ఒకటి నుంచి అంటే ఆదివారం నుంచి అమలు చేయనున్నట్లుగా టెలికాం సంస్థలు ప్రకటించాయి.
ట్రేసబులిటీ సిస్టమ్ అంటే
సురక్షితమైన లావాదేవీలకు వన్ టైమ్ పాస్ వర్డ్ కీలకం. ఇప్పుడు ఈ ఓటీపీ మనకు ఒక్క క్షణంలో వచ్చేస్తుంది. ట్రేసబులిటీ అంటే నకిలీ మెసేజ్‌లు కాల్స్ ఫిల్టర్ చేయడమే. మోసపూరిత, నకిలీ మెసేజ్‌లను గుర్తించేందుకు ఈ ట్రేసబులిటీ సిస్టమ్ ను అమలు చేయబోతున్నారు. ఈ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం వల్ల OTP మెసేజ్ రావడానికి కొంత సమయం పడుతుందని టెలికాలం నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఓటీపీ మనకు క్షణాల్లో వస్తోంది. కానీ ఇక ముందు ట్రేసబులిటీని అమలు చేయడం వల్ల బ్యాంకింగ్, రిజర్వేషన్, ఆన్‌లైన్ డెలివరీ, కొరియర్ వంటి చోట్ల ఓటీపీ రావాలంటే సమయం పట్టే అవకాశం ఉంది.
ఆలస్యం ఏమీ ఉండదంటున్న ట్రాయ్
కొత్త మెసేజ్ ట్రేసబిలిటీ నిబంధనలు అమలులోకి వచ్చినా ఓటీపీలు రావడంలో ఎలాంటి ఆలస్యం ఉండదని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ చెబుతోంది. నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఓటీపీ మెసేజ్‌ల డెలివరీలో ఎలాంటి జాప్యం ఉండదని ప్రకటన జారీ చేసింది. ఓటీపీలు ఆలస్యమవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. ఓటీపీల తరహాలో ఉండే మెసెజుల ద్వారా లింకులు లేదా మేసేజ్‌లపై క్లిక్ చేయడం ద్వారా హ్యాకర్లు మొబైల్ నుంచి సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా నియంత్రించేందుకే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు ట్రాయ్ ప్రకటించింది.
Also Read: TANAలో 30 కోట్ల గోల్ మాల్ - కోశాధికారే కొట్టేశారు - ప్రవాసాంధ్రుల పరువు పోయినట్లే !
రిజిస్టర్ చేసుకున్న సంస్థలు మాత్రమే ఓటీపీలు పంపగలవు !
ట్రేసబులిటీ సిస్టమ్ వల్ల యాప్స్, వెబ్‌సైట్లు, వాటి పేర్లను తప్పనిసరిగా ఓటీపీలు పంపేందుకు నమోదు చేసుకోవాలి. లేకుంటే వాటి నుంచి వచ్చే మెసేజ్‌లు, ఓటీపీలు కస్టమర్లకు చేరవు. బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్లు, జొమాటో, ఉబర్ వంటి యాప్స్ కి ఈ నిబంధనలు వర్తిస్తాయి. అవాంఛిత ఏపీకేలు, లింకులు, మెసేజ్‌లు, నవంబర్లు ఉన్న సందేశాలను టెలికాం సంస్థలు బ్లాక్ చేస్తాయి.అంటే చాలా వరకూ సైబర్ మోసాల నుంచి ప్రజలు బయటపడవచ్చు. మన దేశంలో ఆన్ లైన్ ఫ్రాడ్ వల్ల వేల కోట్లను ప్రజలు నష్టపోతున్నారు. ఈ ట్రేసబులిటీ వల్ల ప్రజలకు మేలు జరిగితే .. ఓ పది సెకన్లు ఓటీపీలు ఆలస్యమైనా భరిస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.