Kadapa ZP Chairman: కడప జడ్పీ చైర్మన్‌కు ఉపఎన్నిక - వైసీపీకి మరో కఠిన పరీక్ష
YSRCP: కడప జడ్పీ చైర్మన్ ఉపఎన్నిక 27వ తేదీన జరగనుంది. జగన్ కు ఇది పెను సవాల్ గా మారింది.

Kadapa ZP Chairman: రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు 27వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 28 ఎంపీపీలు, 19 వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్తుల్లో 12 కో ఆప్టెడ్ సభ్యులు, 214 పంచాయితీల్లో ఉప సర్పంచ్ పదవులు, కడప జడ్పీ చైర్మన్, కర్నూలు జడ్పీ కో ఆప్టెడ్ మెంబర్ పదవులకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం మొత్తం 7 వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కడప జడ్పీ చైర్మన్ పీటంపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది.
కడప జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా రామగోవిందరెడ్డి
కడప జడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో జడ్పీ చైర్మన్ పదవికి ఉపఎన్నిక ఖాయమని తేలడంతో వైసీపీ అధినేత జగన్ చాలా ముందు నుంచే ఉపఎన్నికపై దృష్టి పెట్టారు. బిల్లులు రాలేదన్న అసంతృప్తిలో ఉన్న జడ్పీటీసీలను పిలిపించుకుని మాట్లాడారు. బ్రహ్మంగారి మఠం మండలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. జడ్పీటీసీలు పార్టీ మారకుండా ఆయన వారి డిమాండ్లు తీరుస్తున్నారు.
వైసీపీకి పెను సవాల్
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధిచింది. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో 49 మంది వైసీపీ జడ్పీటీసీ సభ్యులు. వీరిలో 38 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోపవరం నుంచి మాత్రం ఒక్క టీడీపీ సభ్యుడు విజయం సాధించారు. ప్రస్తుతానికి రెండు జడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీకి అధికారికంగా ఒకరు ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆరుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరారు. మరికొంత మది అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే కడప జడ్పీ చైర్మన్ పీఠం మిస్సయితే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని జగన్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఉండడంతో విజయం తమదేనని కూటమి భావిస్తోంది.
క్యాంపునకు వైసీపీ జడ్పీటీసీలు - టీడీపీ వ్యూహం ఏమిటి ?
కడప జడ్పీచైర్మన్ ఎన్నికలో టీడీపీ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. జడ్పీటీసీలను ఆకర్షించి.. పీఠం కైవసం చేసుకోవాలని అనుకుంటుందో లేదో స్పష్టత లేదు. ఇప్పటికే సాగునీటి ఎన్నికల్లో వైసీపీ నేతలు పోటీ చేయలేకపోయారు. ఒక్కటంటే ఒక్క జడ్పీటీసీ ఉన్న టీడీపీ కడప జడ్పీచైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటే జగన్ కు అంత కంటే ఘోరమైన ఓటమి ఉండదు. అప్రజాస్వామ్యని ఎంత గగ్గోలు పెట్టినా.. ఫలితం మాత్రం మారదు. పరువు తిరిగిరాదు. అందుకే జగన్ కు కడప జడ్పీచైర్మన్ ఎన్నిక పెను సవాల్ గా మారింది. బీటెక్ రవితో పాటు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి నిర్ణయం మేరకు టీడీపీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మద్దతు ఉందనుకుంటేనే పోటీ చేస్తారు..లేకపోతే వైసీపీకి ఏకగ్రీవానికి చాన్స్ లభిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

