అన్వేషించండి

Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?

Tillu Square Review: సూపర్ హిట్ 'డీజే టిల్లు' సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డ ఈ రోజు థియేటర్లలోకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

Tillu Square Movie Review In Telugu: 'డీజే టిల్లు' విడుదలకు ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. టిల్లన్న క్యారెక్టర్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. సర్ ప్రైజ్ అయ్యారు. బాక్సాఫీస్ బరిలో సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు టిల్లు ఎలా బిహేవ్ చేస్తాడు? ఎలా మాట్లాడతాడు? అనేది ప్రేక్షకులకు తెలుసు. సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తోడు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ యాడ్ కావడంతో అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూడండి.

కథ (Tillu Square movie story): రాధిక ఎపిసోడ్ తర్వాత టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ) జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) వస్తుంది. ఒక పబ్బులో ఇద్దరూ కలుస్తారు. ముందు మాట మాట కలిశాయి. ఆ తర్వాత పెదవులు  కలిశాయి. ముద్దుల తర్వాత ఇద్దరూ గదిలోకి వెళ్తారు. తెల్లారేసరికి ఒక లెటర్ పెట్టేసి వెళ్లి మాయం అయిపోతుంది. ఆమె ఆలోచనలతో ఎక్కడ ఉందోనని వెతకడం మొదలుపెడతాడు టిల్లు. నెల తర్వాత ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది లిల్లీ. పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకువస్తాడు. సరిగ్గా టిల్లు బర్త్ డే రోజు వెళ్లి తన ఇంటికి పిలుస్తుంది. అక్కడికి వెళితే... అది రాధిక (నేహా శెట్టి) ఫ్లాట్. రోహిత్ (కిరీటి దామరాజు) ఎక్కడ అయితే చనిపోయాడో అదే ఫ్లాట్. 

అన్నయ్య రోహిత్ సంవత్సరం నుంచి కనిపించడం లేదని, అతడిని వెతకడంలో సాయం చేయమని టిల్లూను కోరుతుంది లిల్లీ. ఆ తర్వాత ఏం జరిగింది? ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు వచ్చింది? ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్ (మురళీ శర్మ)కు, టిల్లు జీవితానికి సంబంధం ఏమిటి? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Tillu Square Movie Review): 'డీజే టిల్లు' విజయానికి కథో లేదంటే కథనమో కారణం కాదు... టిల్లు క్యారెక్టర్రైజేషన్, ఆ క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ అండ్ మ్యూజిక్! 'టిల్లు స్క్వేర్' దర్శక రచయితలు ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ప్రేక్షకులకు టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంది కనుక స్టార్టింగ్ సీన్ నుంచి‌ టిల్లు నుంచి ఆశించే వినోదాన్ని అందించారు.

'టిల్లు స్క్వేర్' స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్ చేసేలా... టిల్లు క్యారెక్టర్ వైబ్ క్రియేట్ చేయడంలో... మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కీ రోల్ ప్లే చేశాయి. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్ గానీ, 'రాధికా రాధికా' పాట గానీ బావున్నాయి. అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' గానీ బావున్నాయి. మ్యూజిక్ పరంగా మెయిన్ హీరో అంటే రీ రికార్డింగ్ చేసిన భీమ్స్. టిల్లు వైబ్ మిస్ కాకుండా చూశారు. ఎట్ ద సేమ్ టైమ్... ఇంటర్వెల్ దగ్గర అనుపమకు ఇచ్చిన ఆర్ఆర్, రాధిక రీ ఎంట్రీ & క్లైమాక్స్‌లో ఆర్ఆర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.

టిల్లు నుంచి ఆశించే కామెడీ ఇవ్వడంలో సక్సెస్ అయిన దర్శక రచయితలు... కథ పరంగా సర్‌ప్రైజ్ చేయడం, టెన్షన్ బిల్డ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. టిల్లు బర్త్ డే వరకు కామెడీ ఎంటర్టైన్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టుల్ని అందరూ యాక్సెప్ట్ చేయడం కష్టమే. ఇంటర్వెల్ తర్వాత కామెడీ డోస్ తగ్గి, కథలోకి ఎక్కువ వెళ్లడం... ఆ గేమ్ ప్లాన్స్ ఫోర్స్డ్‌గా ఉన్నాయి. దాంతో కామెడీని ఎంజాయ్ చేయడం కాస్త తగ్గుతుంది. కానీ, డైలాగ్స్ పేలాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. ఫస్ట్‌ పార్ట్‌తో బాగా కనెక్ట్ చేశారు గానీ... ఆ రేంజ్‌లో ట్విస్టులు వర్కవుట్‌ కాలేదు. సిద్ధూ దగ్గరకు అనుపమ రావడానికి గల కారణం అంత కన్వీన్సింగ్‌గా లేదు. 

టిల్లు అంటే సిద్ధూ జొన్నలగడ్డ... సిద్ధూ జొన్నలగడ్డ అంటే డిజే టిల్లు. ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ కావడంతో కేక్ వాక్ చేసినట్లు సన్నివేశాలలో నటిస్తూ వెళ్ళిపోయారు సిద్ధూ జొన్నలగడ్డ. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్... ప్రతిదీ పర్ఫెక్ట్ నోట్‌లో ఉంది. నో మోర్ డౌట్స్... టిల్లు క్యారెక్టర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. వాళ్లకు సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అనుపమ పరమేశ్వరన్. టీజర్, ట్రైలర్లలో ఆమె గ్లామర్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. క్యారెక్టర్ డిమాండ్ మేరకు గ్లామరస్‌గా కనిపించారు. అయితే... గ్లామర్ కంటే ఎక్కువ ఆ క్యారెక్టర్ బేస్ చేసుకుని వచ్చే ట్విస్టులు, క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది.

Also Read: ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?

అతిథి పాత్రలో రాధికగా నేహా శెట్టి కనిపించారు. రాధిక నుంచి ప్రేక్షకులు కోరుకునే మూమెంట్స్ ఆమె ఎంట్రీ సీన్ ఇస్తుంది. బ్లాక్ శారీలో బ్యూటిఫుల్‌గా కనిపించారు. టిల్లు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్, మార్కస్ పాత్రలో ప్రణీత్ రెడ్డి నవ్వించారు. ప్రిన్స్, మురళీ శర్మ పాత్రలు కథలో పరిమితమే.

టిల్లు అంటే ఎంటర్టైన్మెంట్! ఎంటర్టైన్మెంట్ అంటే టిల్లు! అనుపమ గ్లామర్‌ యాడెడ్‌ అడ్వాంటేజ్‌ (టీజర్, ట్రైలర్ కంటే ఎక్కువ లేదు). కథ, కాకరకాయ గురించి ఆలోచించకుండా టిల్లు కామెడీ ఎంజాయ్ చేయడం కోసం హ్యాపీగా వెళ్ళవచ్చు. అంతకు మించి ఎక్కువ ఆశిస్తే కష్టం! టిల్లు మేజిక్ వర్కవుట్ అయ్యింది. కానీ, మూవీ మేజిక్ రిపీట్ చేయడంలో ఆ అడుగు దూరంలో ఆగింది. 

Also Readమమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
Embed widget