Shivam Bhaje Movie Review - 'శివం భజే' రివ్యూ: ముస్లిం దర్శకుడి హిందూ మైథలాజికల్ థ్రిల్లర్ - అశ్విన్ బాబు సినిమా ఎలా ఉందంటే?
Shivam Bhaje Review In Telugu: అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన 'శివం భజే' ఎలా ఉంది? శివుడికి, కథకు సంబంధం ఏంటి? అనేది చూడండి.
అప్సర్
అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, 'హైపర్' ఆది, బ్రహ్మాజీ, మురళీ శర్మ, తులసి, దిగంగన సూర్యవంశీ తదితరులు
Ashwin Babu's Shivam Bhaje Movie Review In Telugu: అశ్విన్ బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'శివం భజే'. దిగంగన సూర్యవంశీ హీరోయిన్. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, మురళీ శర్మ, 'హైపర్' ఆది కీలక పాత్రల్లో నటించారు. అప్సర్ దర్శకత్వం వహించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేశారు. ప్రచార చిత్రాల్లో శివుడి ప్రస్తావన, పాటల్లో శివ స్తుతి అంచనాలు పెంచాయి. ఈ రోజు థియేటర్లలో సినిమా విడుదలైంది (Shivam Bhaje Release Date). ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ (Shivam Bhaje Story): చంద్రశేఖర్ (అశ్విన్ బాబు) రికవరీ ఏజెంట్. ఓ లోన్, ఈఎంఐ విషయంలో జరిగిన గొడవలో కంటి చూపు పోతుంది. ఆ తర్వాత అతనికి వేరే వ్యక్తి కళ్లు పెడతారు. అప్పట్నుంచి కలలో ఎవరెవరో కనిపిస్తారు. ఆ కనిపించేది ఎవరు? హైదరాబాద్ సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు, పాకిస్తాన్ - చైనా కలిసి ఇండియా మీద చేసిన కుట్ర (ఆపరేషన్ లామా)కు, చందు కలలకు సంబంధం ఏమిటి?
సర్జరీ ద్వారా తనకు పెట్టిన కళ్ల కారణంగా దేశాన్ని ఓ పెను ప్రమాదం నుంచి చంద్రశేఖర్ ఎలా కాపాడాడు? ప్రేమించిన అమ్మాయి శైలజ కృష్ణమూర్తి (దిగంగన సూర్యవంశీ)ని ఎలా కాపాడాడు? ఈ కథలో ఏసీపీ మురళి (అర్భాజ్ ఖాన్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Shivam Bhaje Review Telugu): యువ హీరోల్లో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్న తెలుగు కథానాయకులలో అశ్విన్ బాబు (Ashwin Babu) పేరు ముందు వరుసలో ఉంటుంది. 'శివం భజే'తో మరోసారి ఆయన మరో వైవిధ్యమైన కథతో వచ్చారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి జినోప్లాస్ట్ టాపిక్ బేస్ చేసుకుని సినిమా చేశారు. కథ, కథలో తీసుకున్న పాయింట్స్ నిజంగా కొత్తగా ఉన్నాయి.
'శివం భజే' ఓ సాధారణ కమర్షియల్ సినిమా అన్నట్టు ప్రారంభమైంది. హీరో అశ్విన్ బాబుకు కంటి చూపు పోవడంతో కథ కాస్త కొత్త దారిలోకి వెళ్లింది. అప్పటి వరకు హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు గానీ, పాటలు గానీ ఏమంత ఆసక్తి కలిగించవు. ఒక్కసారి కంటి సర్జరీ తర్వాత కథ టర్న్ తీసుకుంది. అయితే, ఆ కళ్లు ఎవరివి అని రివీల్ చేయడం ప్రేక్షకులకు షాక్ అని చెప్పాలి. ఆ తర్వాత ప్రతి సన్నివేశం కొత్తగా కనిపిస్తుంది.
'శివం భజే'లో కళ్లు ఎవరివి? అనేది గానీ, హత్యలు ఎవరు చేస్తున్నారు? అనేది గానీ చెప్పడం పెద్ద కష్టం కాదు. కానీ, ఆ సీన్స్ రివీల్ చేసిన తీరు బావుంటుంది. కుక్క కళ్లు మనిషికి పెట్టడం అనేది సినిమాలో మెయిన్ పాయింట్. ఈ ట్విస్ట్ తెల్సినా సరే ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. దర్శకుడు అప్సర్ చాలా సన్నివేశాల్లో టాలెంట్ చూపించారు. ముఖ్యంగా శివుని మీద తీసిన పాట గానీ, ఆయన మీద సన్నివేశాలు గానీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
Also Read: రాయన్ రివ్యూ: బాషా టైపు కథతో ధనుష్ 50వ సినిమా - హీరోగా, దర్శకుడిగా ఆయన హిట్టా? ఫట్టా?
'శివం భజే'కు ఆఫ్ స్క్రీన్ అసలైన హీరో మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బాడిస. సాంగ్స్ కంటే రీ రికార్డింగ్ విషయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు. సినిమాటోగ్రఫీ, మిగతా అంశాలు సైతం బావున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. టెక్నికల్ పరంగా మూవీ హై స్టాండర్డ్స్‌లో ఉంది. స్టార్టింగ్ సన్నివేశాల్లో రొటీన్ కమర్షియల్ ఫైట్, ఆ లవ్ ట్రాక్ బాగా రాసుకుంటే బావుండేది.
చంద్రశేఖర్ పాత్రలో అశ్విన్ బాబు చక్కగా నటించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో అదరగొట్టారు. అశ్విన్ తర్వాత అర్భాజ్ ఖాన్ క్యారెక్టర్ గుర్తు ఉంటుంది. ఆయనది విలన్ రోల్ అని చెప్పలేం. పవర్ ఫుల్ ఏసీపీగా తన పాత్ర పరిధి మేరకు చేశారు. 'హైపర్' ఆది, బ్రహ్మాజీ కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయించారు. దిగంగన సూర్యవంశీ పాత్ర పరిధి పరిమితమే. కానీ, ఉన్నంతలో బాగా చేశారు.
రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ సినిమాలు కాకుండా కమర్షియల్ ఫార్మాటులో కొత్త కాన్సెప్ట్, పాయింట్ ఉన్న సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు 'శివం భజే' మంచి ఛాయస్. లయకారుడు పరమశివుని నేపథ్యంలో వచ్చే ప్రతి సన్నివేశం, శివుని నేపథ్యంలో పాటలు గూస్ బంప్స్ ఇస్తాయి.
Also Read: బ్లడీ ఇష్క్ రివ్యూ - Hotstarలో అవికా గోర్ హారర్ ఫిల్మ్ - ఈ ఎఫైర్స్ ఏంటి డాడీ బ్రో?