ఆగస్టు తొలి వారంలో... ముఖ్యంగా 1, 2వ తేదీల్లో విడుదల అవుతున్న తెలుగు సినిమాలు ఏవో చూడండి.

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన 'తిరగబడరా సామి' ఆగస్టు 2న విడుదల అవుతోంది.

అల్లు శిరీష్ హీరోగా నటించిన 'బడ్డీ' సినిమా ఆగస్టు 2న రిలీజ్ అవుతోంది.

మైథాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'శివం భజే'తో ఆగస్టు 1న యంగ్ హీరో అశ్విన్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ కూడా 'తుఫాన్'తో ఆగస్టు 2న థియేటర్లలోకి వస్తున్నారు.

ఆగస్టు 2న వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' కూడా విడుదల అవుతోంది.

విజ‌య్‌ భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఆయన కుమారుడు శ్రీ‌ క‌మ‌ల్‌ నటించిన 'ఉషా పరిణయం' ఆగస్టు 2న విడుదల అవుతోంది.

కృష్ణ వంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించిన 'అలనాటి రామచంద్రుడు' విడుదల కూడా ఆగస్టు 2నే

'ఏవరేజ్ స్టూడెంట్ నాని'తో పాటు 'లారి' అనే మరో చిన్న సినిమా సైతం ఆగస్టు 2న థియేటర్లలోకి వస్తోంది.