మాస్‌ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ మిస్టర్‌ బచ్చన్‌

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందునుంచే భారీ అంచనాలు ఉన్నాయి

ఆగస్ట్‌ 15న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా టీజర్‌ రిలీజ్‌ చేశారు

టీజర్‌ని అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రిలీజ్‌ చేసి మెయిన్‌ లీడ్స్‌, కథపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్‌

ఇందులో రవితేజ ఆదాయపన్ను శాఖ అధికారిక కనిపించబోతున్నాడని అర్థమైపోతుంది

దేశంలో దరిద్రం కన్నా ప్రమాదకరమైన నల్ల ధనాన్ని అరికట్టేందుకు రవితేజ ఏం చేసేశాడనేతే ఈ కథ

ఊళ్లో పేరున్న ఓ పెద్ద మనిషి (జగపతి బాబు) ఇంటిపై రైడ్‌ చేసి డిపార్ట్‌మెంట్‌లో హైలెట్‌ అవుతాడు

ఐటీ రైడ్స్‌ అంటే వ్యాపారవేత్తలు, రాజకీయ, ప్రభుత్వ అధికారులపై చేస్తారు

కానీ ఇక్కడ ఊర్లోని పెద్ద మనిషి ఇంట్లో దాడి చేయడమనే పాయింట్‌ ఆసక్తిని కలిగిస్తోంది

ఇక్కడే హరీశ్ శంకర్‌ ఆడియన్స్‌ ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడు

చూస్తుంటే ఈ సినిమాతో మాస్‌ మహారాజా ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పక్కా అంటున్నారు