సౌత్‌లో సక్సెస్, స్టార్‌డమ్ వచ్చినా బాలీవుడ్‌లో సక్సెస్ కోసం మరోసారి ట్రై చేస్తున్న హీరోయిన్లు ఎవరో చూడండి

రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్‌ల 'స్త్రీ 2', జాన్ అబ్రహం 'వేద'లో తమన్నా నటించారు. 

అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే'లో ఆదిత్య సీల్‌కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించారు. ఆమెకు సక్సెస్ వస్తుందో? రాదో?

మృణాల్ ఠాకూర్ హిందీ హీరోయినే. అయితే... 'సీతా రామం' లాంటి సక్సెస్ అక్కడ లేదు. ఇప్పుడు వరుణ్ ధావన్ సినిమాతో రావాలని ఆశిద్దాం. 

పూజా హెగ్డే సౌత్‌లో స్టార్ హీరోయిన్. హిందీలో ఆ స్థాయి సక్సెస్ రాలేదు. షాహిద్ కపూర్ 'దేవా'తో వస్తుందేమో చూడాలి.

వరుణ్ ధావన్ 'బేబీ జాన్'తో కీర్తీ సురేష్ హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు.

హిందీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన నిధి అగర్వాల్... ఇప్పుడు 'డంక్' అని ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు.

అజయ్ దేవగణ్ 'ఎటాక్' నుంచి రకుల్ బాలీవుడ్ సినిమాలే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు 'దే దే ప్యార్ దే 2' ఆమె చేతిలో ఉంది. 

'పుష్ప', 'యానిమల్'తో హిందీలోనూ రష్మిక హిట్స్ కొట్టారు. అవి సౌత్ డైరెక్టర్లు తీసిన సినిమాలు. ప్రజెంట్ హిందీ సినిమాలతో ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి. 

పాన్ ఇండియా ఫిల్మ్స్ 'శాకుంతలం', 'యశోద' సమంతకు సక్సెస్ ఇవ్వలేదు. రాజ్ అండ్ డీకేతో ఇప్పుడు ఓటీటీ కోసం 'రక్త బ్రహ్మాండ్', 'సిటాడెల్' చేస్తున్నారు.