జస్ట్.. ముఖం చూసి డిప్రెషన్‌ను గుర్తించే సరికొత్త AI అప్లికేషన్, ఈ రోజుల్లో చాలా అవసరం!
డిప్రెషన్ లక్షణాలు బయటపడకముందే, ముఖం చూసి డిప్రెషన్‌ను కనిపెట్టే అప్లికేషన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. మీరు ఫోన్ లాక్ తీయగానే మొహం చూసి, పసిగడుతుంది.
ఈ మధ్య యువతను పట్టిపీడిస్తున్న అది పెద్ద సమస్య డిప్రెషన్. యువతే కాదు, స్కూల్ పిల్లలు, వృద్దులు కూడా డిప్రెషన్ బారినపడి, ఎలా బయటపడాలో తెలియక ప్రాణాలు తీసుకోవటం చూస్తున్నాం. కారణం ఏదైనప్పటికీ, మానసిక ఆరోగ్యం మీద అన్ని వయసుల వారు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. మీరు జస్ట్ ఫోన్‌ను అన్‌లాక్ చేస్తే చాలు.. వెంటనే మీ ముఖం చూసి మీ పరిస్థితిని పసిగట్టేస్తుంది. డిప్రెషన్‌లో ఉంటే అలర్ట్ చేస్తుంది.
ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో పనిచేస్తుంది. మీ ముఖకవలికల ఆధారంగా, డిప్రెషన్‌ను గుర్తిస్తుంది. మూడ్ క్యాప్చర్ అనే ఈ యాప్ ఫోన్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి, యూజర్ ముఖం, చుట్టుపక్కల వాతావరణం పరిశీలించి, డిప్రెషన్ లక్షణాలను గుర్తిస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నట్లయితే.. వెంటనే చెప్పేస్తుంది. దానివల్ల బాధితుడు త్వరగా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
ఈ యాప్ పనితీరును పరిశీలించినపుడు 75% డిప్రెషన్ లక్షణాలను, చాలా త్వరగా గుర్తించినట్టు తేలింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి, రోజుకు కొన్ని వందల సార్లు ఫోన్ లాక్ తీస్తాం. ఈ మూడ్ క్యాప్చర్ యాప్ కూడా అదే టెక్నాలజీని ఉపయోగించి, ఏఐ లెర్నింగ్, ఏఐ హార్డ్వేర్ సహాయంతో తయారు చేశారు. అందువల్ల, యూజర్ దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు.
UK లోని ప్రతి ఐదు మంది యువతలో ఒక్కరికి డిప్రెషన్ ఉన్నట్లు గుర్తించారు. ప్రతి పది మందిలో వారానికి ముగ్గురు డిప్రెషన్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. మేజర్ డిప్రెస్సివ్ డిజార్దర్ బారిన పడిన 177 మంది మీద 90 రోజుల పాటు ఈ యాప్ ను పరీక్షించినపుడు, అది 1,25,000 ఇమేజ్ లను పరీక్షించి, సరైన ఫలితాలను ఇచ్చింది. ఈ యాప్ పనితీరు సానుకూలంగా ఉండటంతో, వచ్చే ఐదేళ్లలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
యూజర్‌ను ఎలాంటి ఇబ్బందికి గురి చేయకుండా, కేవలం ముఖకవలికల ద్వారా అతి పెద్ద మానసిక సమస్య అయిన మేజర్ డిప్రెస్సివ్ డిజార్డర్ ను గుర్తించే టెక్నాలజీ ఈ యాప్ ద్వారా సాధ్యం కాబోతోంది. ఈ యాప్ ని పరీక్షించినపుడు వచ్చిన సానుకూల ఫలితాలను బట్టి, మరో ఐదేళ్ల లోపు యూజర్లకు అందుబాటులోకి తెస్తామని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ యాప్ 90% సరైన ఫలితాలు ఇచ్చేంత వరకు దీన్ని మార్పులు చేస్తూ, పరిశీలించనున్నారు.
ఈ యాప్ ఎలా పని చేస్తుందంటే..
మూడ్ క్యాప్చర్ యూజర్ యొక్క డిప్రెషన్ లక్షణాలను గుర్తించిన తర్వాత, డిప్రెషన్ ఉన్నట్ట్లు ఆ యూజర్ కు చెప్పి భయపెట్టకుండా, కాసేపు అలా బయట తిరిగి రమ్మని, ఫ్రెండ్స్ తో మాట్లాడమని పరిస్థితికి తగినట్లు సూచనలు చేస్తుంది. మీకు డిప్రెషన్ ఉందని మీరు గుర్తించక ముందే, అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ద్వారా, ఈ యాప్ గుర్తించి, పరిస్థితి చేజారి పోకముందే అప్రమత్తం చేస్తుంది.
Also Read: నిశ్చితార్థానికి, పెళ్లికి ఇంత మార్పా? అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణం అదేనట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.