News
News
X

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

మంకీపాక్స్ ఇప్పుడు అన్ని దేశాలకు పాకిపోతోంది. ఇదొక గ్లోబల్ హెల్త్ సమస్యగా మారింది.

FOLLOW US: 

మంకీపాక్స్ వ్యాధి ప్రస్తుతం 80 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17,000 కేసులు బయటపడ్డాయి. అందులో ఆరు నుంచి ఏడు వరకు మరణాలు కూడా నమోదయ్యాయి. ఆ మరణాలన్నీ ఆఫ్రికా దేశాల్లోనే సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను ఇప్పటి వరకు ప్రజలకు అవగాహన కల్పించింది. అయితే మంకీపాక్స్ గురించి పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనుగొంటూనే ఉన్నారు. ప్రస్తుతం మంకీపాక్స్ కు సంబంధించి రెండు కొత్త లక్షణాలను కనుగొన్నారు. 

బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనాన్ని బట్టి మంకీపాక్స్‌‌కు సంబంధించి రెండు కొత్త లక్షణాలు కూడా ఉన్నాయి. యూకే పరిశోధకులు 197 మంది మంకీపాక్స్ రోగుల డేటాను పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న 71 మంది రోగుల్లో మలద్వారం భాగంలో విపరీతమైన నొప్పిని అనుభవించారు. 33 మంది గొంతునొప్పితో, 31 మంది పెనిల్ ఎడెమాతో, 27 మంది నోటి గాయాలతో బాధపడ్డారు. తొమ్మిది మంది టాన్సిల్స్ నొప్పిని అనుభవించారు. 

కొత్త లక్షణాలు ఇవే
ఈ అధ్యయనంలో మంకీపాక్స్ సోకితే కలిగే కొత్త లక్సణాలను కనుగొన్నారు. అందులో ఒకటి నల్లటి పుండ్లు. అవి పులిపిర్లలా ఉంటాయి. నల్లటి మెలనోమా నిండిన గాయాల్లా ఉంటాయవి. అలాగే టాన్సిల్స్ నొప్పి పెట్టడం కూడా మంకీ పాక్స్ లక్షణాలలో ఒకటిగా గుర్తించారు. నల్లటి పులిపిర్లలాంటి పుండ్లతో పాటూ టాన్సిల్స్ కూడా వచ్చాయంటే మంకీపాక్సేమో అనుమానించాల్సిందే.  

ఇతర లక్షణాలు...
మంకీపాక్స్ ప్రధానంగా స్వలింగ సంపర్కులు మధ్య,  ద్విలింగ సంపర్కులు, అలాగే ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే...

1. జ్వరం
2. తలనొప్పి
3. కండరాల నొప్పి
4. జాయింట్ పెయిన్
5. నడుము నొప్పి
6. లింఫ్ గ్రంథుల వాపు
7. దద్దుర్లు
8. విపరీతమైన అలసట

Also read: ఆరోగ్యకరమైన చిరుతిండి క్యాప్సికమ్ రింగ్స్, ఇలా చేస్తే కరకరలాడతాయి

Also read: నా పెళ్లికి రండి, విందుకు డబ్బులు చెల్లించండి, కాబోయే వధువు వెరైటీ అతిధి పిలుపు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 08 Aug 2022 08:22 PM (IST) Tags: Monkeypox Monkeypox Virus monkeypox symptoms Monkeypox virus New Signs

సంబంధిత కథనాలు

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే ఆ నష్టం తప్పదు

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే  ఆ నష్టం తప్పదు

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

Viral Pic: అనసూయ బాటలో ఉబర్ క్యాబ్ డ్రైవర్, మాటల్లేవ్ ఆ బోర్డే చెప్పేస్తుంది!

Viral Pic: అనసూయ బాటలో ఉబర్ క్యాబ్ డ్రైవర్, మాటల్లేవ్ ఆ బోర్డే చెప్పేస్తుంది!

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

టాప్ స్టోరీస్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్