Viral: నా పెళ్లికి రండి, విందుకు డబ్బులు చెల్లించండి, కాబోయే వధువు వెరైటీ అతిధి పిలుపు
త్వరలో పెళ్లి చేసుకునే అమ్మాయి అతిధుల ముందు విచిత్రమైన డీల్ పెట్టింది.
పెళ్లంటే జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. డబ్బులు ఉంటే ఆ ఘట్టం మరింత అందంగా మెరుగులద్దుకుంటుంది, అదే డబ్బు లేకుంటే మాత్రం అంతా సాదాసీదాగా ఉంటుంది. కానీ పెళ్లిలో కచ్చితంగా ఉండాల్సింది విందు. దానికి కూడా కనీసం డబ్బుల్లేని వారు ఉన్నారు. ఒక వధువు పరిస్థితి ఇదే. తన పెళ్లికి కనీసం అతిధులకు భోజనాలు పెట్టే పరిస్థితిలో కూడా ఆమె లేదు. దీంతో ఆ వధువుకు విచిత్రమైన ఐడియా వచ్చింది. ఆ ఐడియాను సోషల్ మీడియాలో పంచుకుంది కాబోయే వధువు.
అమెరికాకు చెందిన అమ్మాయి త్వరలో పెళ్లి. కానీ చేతిలో పెద్దగా డబ్బుల్లేవు. పెళ్లయ్యాక డ్రింకులు, మంచి ఆహారంతో రిసెప్షన్ ఏర్పాటు చేయకపోతే పెళ్లితంతు పూర్తికాదు. అందుకే కానీ పెళ్లికి పిలిచిన అతిధులకు భోజనం పెట్టేందుకు కూడా ఆమె దగ్గర డబ్బుల్లేవు. అందుకే ఆమెకు మంచి ఆలోచనా వచ్చింది. పెళ్లికి వచ్చే అతిధులు ఓ పూలబోకేనో, బహుమతో పట్టుకొస్తారు కదా... వాటికి బదులు వారు తిన్న విందుకు రుసుము చెల్లించమని అడిగేందుకు సిద్ధమైంది. దీని వల్ల ఆమెకు భారం ఉండదని, అతిధులకు కూడా పెద్ద నష్టం ఉండదని ఆలోచన. ఇప్పటికే పెళ్లి కార్డులపై ఈ విషయాన్ని ప్రింటు వేసి అతిధులను పిలిచేసింది కూడా. ఇదే విషయాన్ని ఫేస్ బుక్‌లోని నెటిజన్లతో పంచుకుంది. తన ఐడియా బాగుందా అంటూ అడిగింది. దానికి ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించారు.
‘అతిధులకు పెళ్లి విందుకు రుసుము చెల్లించని లేకుంటే పెళ్లే క్యాన్సిల్ చేసుకుంటానని ఆహ్వానం పంపాను. వారెలా స్పందిస్తారో, వస్తారో రారో తెలియదు. నాకు ఈ విషయంలో చాలా ఒత్తిడికి గురవుతున్నాను. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా?’ అంటూ నెటిజన్లను ప్రశ్నించింది.
ఒక నెటిజన్ ‘నా వరకు అయితే గిఫ్టుకు బదులు నేను తిన్న విందుకు డబ్బులు చెల్లించమనడం సబబుగానే ఉంది’ అని రాసుకొచ్చాడు. మరొక వ్యక్తి కూడా గిఫ్టుకు బదులు విందు అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది అని రెస్పాండ్ అయ్యాడు. అయితే ఒక గిఫ్టు తెచ్చి కుటుంబమంతా విందుకు వస్తేనే పెద్ద సమస్య అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. ఒక గిఫ్టు ఇచ్చి అయిదారుగురు పెళ్లి విందుకు హాజరయ్యే పరిస్థితులు అధికమని, వారు ఏం చేస్తారో అని చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు.
Also read: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే
Also read: భారతదేశంలో పెరిగిపోతున్న బ్రెయిన్ అనూరిజం మరణాలు, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు