అన్వేషించండి

Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ

Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు అందజేసిన పథకాలపై ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. రిపోర్ట్ కార్డు పేరుతో కీలకాంశాలు ప్రస్తావించింది.

Year Ender 2025: 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు ఇవే అంటూ తమ రిపోర్ట్ కార్డును తామే రిలీజ్ చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ఏకంగా ఈ ఒక్క ఏడాదిలోనే 60 అంశాల్లో కీలక నిర్ణయాలు విజయవంతంగా తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ప్రభుత్వం ప్రకటించిన కీలకాంశాలు ఇవే

1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్

2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం

3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం.

4. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం

5. అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు... రూ.6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ

6. దీపం–2 : ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూ.2,684 కోట్లు, ఇప్పటికి దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ 

7. ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు రూ.50,000 కోట్లకుపైగా పెన్షన్ల కోసం వ్యయం... ఏడాదిలో రూ.33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్లు

8. మత్స్యకార భరోసా : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు

9. నేతన్నలకు ఉచిత విద్యుత్ : మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్

10. ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000... రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది

11. అన్నా క్యాంటిన్ : 204 అన్నా క్యాంటిన్లు. ఇప్పటి వ రకు 4 కోట్ల భోజనాలు

12. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు

13. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ - స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు

14. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు వ్యయం.

15. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం రూ.51 కోట్లు 

16. ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు

17. పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు -నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు

18. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం - మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ

19. మెగా డీఎస్సీ... ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ

20. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు

21. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు – బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు

22. దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు.  ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్

23. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు. మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణం

24. కొత్తగా 23 పాలసీలు, పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలి సారి ఎస్క్రో ఖాతాలు

25. సీఐఐ సమ్మిట్ 610 ఒప్పందాలు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలు

26. 13 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.55 పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు

27. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్

28. విశాఖ ఐటీ హబ్, గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన

29. క్వాంటం వ్యాలీకి తొలి అడుగు, అమరావతి పనులు వేగవంతం

30. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు

31. విశాఖలో యోగాంధ్ర నిర్వహణ.., కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ సక్సెస్

32. పీపీపీ విధానంలో పేద విద్యార్ధులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లు

33. గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం

34. రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3 వేల పనులకు శ్రీకారం

35. అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్

36. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 95 సీఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ

37. రాష్ట్రానికి కుంకీ ఏనుగులు. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు. రూ.3,050 కోట్లతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన, 1.21 కోట్ల మంది దాహార్తిని తీర్చాలని లక్ష్యం.

38. 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ - చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు 

39. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు 

40. పోలవరం పనుల్లో పురోగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు- వేగంగా వెలిగొండ పనులు

41. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్‌ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, 5.48 లక్షల మంది రైతులకు రూ.8,120 కోట్లు జమ

42. మార్కెట్ ఇంటర్వెన్షన్ - పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం

43. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం.... పెరిగిన మూలధన వ్యయం

44. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం రద్దు

45. ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం, దరఖాస్తుల స్వీకరణ పూర్తి

46. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో... డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ

47. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

48. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు

49. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్ధులకు హెల్త్ చెకప్, విద్యార్ధుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ‘ముస్తాబు’ కార్యక్రమం

50. గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్ కు అంకురార్పణ. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా కార్యాచరణ... ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర రూ.5.19 నుంచి రూ.4.80కు తగ్గేలా చర్యలు

51. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు.

52. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ – బీసీలకు రూ.20 వేల అదనపు సాయం

53. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి-డ్రగ్స్ అరికట్టాం, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

54. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ, పీ4

55. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి

56. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు- విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పనులు

57. కేంద్రంతో సమన్వయం, దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ, మోదీ గారి సహకారం

58. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు - స్టీల్ ప్లాంట్ కు రూ. 11440 కోట్లతో కేంద్ర ఊతం

59. లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు.

60. కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం, 26 నుంచి 28కి పెరగనున్న జిల్లాల సంఖ్య.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
Advertisement

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Embed widget