Mrithyunjay Trailer : ఓటమి భయంతో యుద్ధం చేయకపోవడమే తప్పు - శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' ట్రైలర్ చూశారా?
Mrithyunjay Trailer Reaction : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ట్రైలర్ వచ్చేసింది. ఓ యాక్సిడెంట్ కేస్ చుట్టూ సాగే స్టోరీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

Sree Vishnu Mrithyunjay Trailer Review : టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. టీజర్‌తో హైప్ క్రియేట్ చేయగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ హైప్ పదింతలు చేసింది.
ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
'మా నాన్న గారికి ఇలా ఎందుకైంది అంకుల్?' అంటూ ఓ చిన్న పాప అడగ్గా... 'ఇప్పుడు నా చేతిలో చిక్కుముడి ఉంది. అది విప్పుతా. కచ్చితంగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇస్తా. ఇట్స్ మై ప్రామిస్' అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ట్విస్టులతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఓ చిన్న పాప కోసం దేనికైనా ఎదురెళ్లే పాత్రలో శ్రీవిష్ణు కనిపించారు.
మర్డర్‌ను యాక్సిడెంట్‌గా చిత్రీకరించగా దాని వెనుక ఎవరున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో హీరోకు ఎదురైన పరిణామాలేంటి? అసలు చనిపోయింది ఎవరు? చిన్న పాపకు శ్రీవిష్ణుకు సంబంధం ఏంటి? పాప తండ్రికి ఈ కేసుకు సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read : రణబాలి వెడ్స్ జయమ్మ - చూడముచ్చటగా కొత్త జంట... విరోష్ కపుల్ వెడ్డింగ్ గిఫ్ట్
ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా... శ్రీవిష్ణు సరసన రేబా మోనికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'సామజవరగమన' బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు ఇదే కాంబో రిపీట్ అవుతుండడంతో హైప్ క్రియేట్ అవుతోంది. రచ్చ రవి, సిజ్జు, అయ్యప్ప, బాలాదిత్య, నంద గోపాల్, కృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రమ్యం గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి చిత్రాన్ని నిర్మించారు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
























