Dhanush D56 Movie: మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
Dhanush New Movie: మరోసారి హిట్ కాంబో రిపీట్ కానుంది. ధనుష్ నెక్స్ట్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. ప్రముఖ నిర్మాత గణేష్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

AR Rahman Music To Dhanush New Movie D56: కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) ప్రస్తుతం 'కుబేర' (Kubera) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'పోయి రా మావా' ఆదివారం రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. ధనుష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.
హిట్ కాంబో రిపీట్
'కుబేర' సాంగ్‌తో ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉండగా.. వారి జోష్ మరింత పెంచేలా మరో అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'సుమో' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఇషారి కె.గణేష్ రెండు కీలక ప్రకటనలు చేశారు. ధనుష్ నెక్స్ట్ మూవీ 'D56'కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు చెప్పారు. మారి సెల్వరాజ్ ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.
దనుష్ రీసెంట్ మూవీ 'రాయన్'కు (Raayan) సైతం రెహమాన్ మ్యూజిక్ అందించగా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ మూవీకి సంగీతం హైలైట్‌గా నిలిచింది. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
'D56'కు ముందే మరో మూవీ..
అలాగే, ధనుష్‌తో మరో ప్రాజెక్టును నిర్మాత గణేష్ ప్రకటించారు. ఈ కొత్త సినిమాకు 'పోర్ థోజిల్' మూవీ దర్శకుడు 'విఘ్నేష్ రాజా' దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. ఈ మూవీ 'D56' కంటే ముందుగానే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ధనుష్.. మార్యన్, రాంఝనా, అత్రంగి రే, రాయన్ చిత్రాలకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా.. మంచి సక్సెస్ సాధించాయి.
'కుబేర' సాంగ్ అదుర్స్
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'పోయి రా మావా'ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్‌గా నిలవగా ధనుష్ మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను ధనుష్ ఆలపించగా.. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. జూన్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ రోల్‌లో ఫస్ట్ టైమ్.. ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనుండగా.. నాగార్జున ఈడీ అధికారి రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.
మరోవైపు, అటు దర్శకుడిగానూ బిజీగా మారారు ధనుష్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై'. ఈ మూవీలో నిత్యా మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నారు.





















