అన్వేషించండి

Sleep Walking: స్లీప్ వాకింగ్ చేసేవారు ఇలాంటి పనులు కూడా చేస్తారు, జాగ్రత్త

స్లీప్ వాకింగ్ ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య.

వినడానికి స్లీప్ వాకింగ్ చిన్న సమస్యగానే కనిపించవచ్చు, కానీ అది ఆరోగ్యాన్ని వేధించే సమస్య. నిద్రలో ఉన్నప్పుడు నడవడాన్ని ‘స్లీప్ వాకింగ్’ అంటారు. దీన్ని ‘సోమ్నాబులిజం’ అని కూడా పిలుస్తారు. ఇది ఒక తీవ్రమైన అంతర్లీన నిద్ర రుగ్మతను సూచిస్తుంది. దీని బారిన పడినవారు కేవలం నిద్రలో నడవడం మాత్రమే చేస్తారని అనుకుంటారు అంతా. కానీ వారు చేసే పనులు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ పనులు చేయాలని లేదు, కానీ కొంతమంది ఇలాంటి పనులు కూడా చేసే అవకాశం ఉంది.

ఏం చేస్తారు?
స్లీప్ వాకింగ్ అంటే మంచం నుంచి దిగి నడుచుకుంటూ వెళ్లిపోతారు అనే మాత్రమే అనుకుంటారు. వారు స్లీప్ వాకింగ్ చేస్తూనే తమ రోజువారి పనులు కూడా చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి లేచి నడుస్తూ కొత్త దుస్తులు తీసి ధరించడం, డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న ఆహారాన్ని తినడం, గిన్నెలు తోమడం, పరిగెత్తడం, ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే కారు కనిపించినా, బైక్ కనిపించినా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొన్నిసార్లు హింసాత్మక పనులు చేస్తుంటారు. కొంతమంది స్లీప్ వాకింగ్‌లోనే ఉన్నప్పుడే సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి పనుల్నీ చేశాక తాపీగా పోయి మళ్లీ మంచం మీద నిద్రపోతారు. నిద్ర నుంచి లేచాక చేసిన పనులేవీ గుర్తుకు రావు. మెలకువ వచ్చాక ఇలా నువ్వు చేసావని చెప్పినా కూడా వారు నమ్మరు. ఆశ్చర్యపోతారు. అందుకే స్లీప్ వాకింగ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. దీనికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి.

పిల్లల్లో కూడా...
స్లీప్ వాకింగ్ అనేది కేవలం పెద్దల్లో వచ్చే రుగ్మత మాత్రమే కాదు, పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా నాలుగు నుంచి ఐదు ఏళ్ళ వయసులో ఉన్న పిల్లల్లో వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో కచ్చితంగా కారణాలు ఇంతవరకు తెలియలేదు.నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడి, ఆల్కహాల్, కొన్ని రకాల మందులు తీసుకోవడం వంటి కారణాల వల్ల స్లీప్ వాకింగ్ వచ్చే అవకాశం ఉందని చెబుతారు.  స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, ఎపిలెప్సీ వంటి రోగలు కలిగిన వారు స్లీప్ వాకింగ్ చేసే అవకాశం ఉంది.

ఎలా నిర్దారిస్తారు?
కొన్ని శారీరక పరీక్షల ద్వారా స్లీప్ వాకింగ్‌ను నిర్ధారిస్తారు. స్లీప్ లాబ్‌లో రాత్రంతా మిమ్మల్ని ఉంచి పాలిసోమ్నోగ్రఫీ పద్ధతి ద్వారా  స్లీప్ వాకింగ్ ఉందో లేదో గుర్తిస్తారు. మీరు నిద్రిస్తున్నప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది మీ హృదయ స్పందన రేటును, మెదడు తరంగాలను, కదలికలను రికార్డు చేస్తారు. మీ మెదడు పనితీరును అధ్యయనం చేయడానికి EEG పరీక్షలు చేస్తారు. 

స్లీప్ వాకింగ్ చికిత్సలో భాగంగా ఆల్కహాల్, డ్రగ్స్ కు దూరంగా ఉండమని చెబుతారు. ఒత్తిడిని తగ్గించుకోమంటారు. క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్‌ను పాటించమని చెబుతారు. జీవనశైలిలో మార్పులను సూచిస్తారు. బెంజోడియాజిపైన్స్, యాంటిడిప్రెసెంట్స్ వంటి మందులు సూచిస్తారు. 

Also read: గర్భం చివరి నెలల్లో నెయ్యి తినడం వల్ల సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఎక్కువా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget