డయాబెటిస్‌ను అదుపులో ఉంచే పానీయం చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలే మధుమేహాన్ని మన శరీరంలోకి ఆహ్వానిస్తుంది. ఇంట్లోనే తయారు చేసిన ఒక పానీయంతో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది మీ జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, ఇన్సులిన్ స్థాయిలను సహజంగా నిర్వహించేలా చేస్తుంది. కాకరకాయ, నేరెడు పండు కలిపి ఈ జ్యూస్ తయారుచేయాలి. దీనికి స్పూన్ నిమ్మరసం, రాళ్ల ఉప్పు వేసి కలపాలి. వడకట్టి గ్లాసులో వేసుకోవాలి. ఈ జ్యూసు రుచిని పెంచడానికి తాజా కొత్తిమీర ఆకులు, అర స్పూన్ తురిమిన అల్లాన్ని కలపొచ్చు. కాకరకాయ, నేరేడు... ఈ రెండింటిలో అవసరమైన పోషకాలు, మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. కాకరకాయలో పాలీ పెప్టైడ్ పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ అసమతుల్యతను పరిష్కరిస్తుంది. అలాగే అధిక చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ జ్యూసును క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం, జుట్టు సమస్యలకు చికిత్స జరుగుతుంది.