RO నీటితో ఆ విటమిన్ లోపం ఇళ్లల్లో RO వాడడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లను ఇది 97% వరకు శుభ్రం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం నిత్యం RO వాటర్ తాగేవారు బి12 లోపానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శాఖాహారులే ఈ విటమిన్ లోపం బారిన పడవచ్చు. ROలో నీరు ప్రవహిస్తున్నప్పుడు అక్కడున్న ప్యూరిఫైయర్లు నీటిలో ఉన్న కోబాల్ట్ ను తొలగిస్తాయి. విటమిన్ బి12 సంశ్లేషణకు కోబాల్ట్ చాలా అవసరం. ఇది లోపిస్తే మన పొట్ట లైనింగ్ దెబ్బతింటుంది. RO నుంచి వచ్చే నీరు వల్ల బి12 లోపం వస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు సరిపడేంత ఉత్పత్తి కావు. విటమిన్ బి12 లోపం రాకుండా ఉండాలంటే పోషకాహారం తినాలి. చికెన్, మటన్, చేపలు, గుడ్లు, సోయా పాలు, పప్పులు వంటివి తినాలి.