హలీమ్ ఎందుకు తినాలి?



రంజాన్ నెలలోనే హలీమ్ డేస్ మొదలైపోతాయి. అందుకే హలీమ్‌ను ఉపవాస దీక్షలో ఉన్నవారు తినడానికి ఇష్టపడతారు.



ఒక కప్పు హలీం తింటే ఒక పూట భోజనం చేసినట్టే అని చెప్పుకుంటారు. దీనిని తింటే రోజంతా శక్తిని అందిస్తుంది.



100 గ్రాముల హలీంలో ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ, డైటరీ, ఫైబర్, సోడియం, షుగర్ అన్నీ ఉంటాయి.



ఒక కప్పు హలీమ్‌ను తిన్నా కూడా అలాంటి సంపూర్ణ ఆహారాన్ని తిన్న ఫీలింగ్ వస్తుంది.



హలీం తింటే ఒక పూట సంపూర్ణమైన భోజనం తిన్నట్టే.



దీనిలో తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పప్పు ధాన్యాలు, గోధుమ రవ్వ వంటివన్నీ వాడతారు.



ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించేవి.