టీ, పసుపే మనల్ని కరోనా నుంచి కాపాడాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కరోనాతో మరణించారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నమోదైన మరణాల సంఖ్య తక్కువే. మనదేశంలో మరణాల సంఖ్య తగ్గడానికి కారణాన్నిఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చేసిన అధ్యయనంలో తేలింది. మన భారతీయులకు రోజూ టీ తాగడం అలవాటు. అలాగే ప్రతి కూరలో కూడా పసుపు వేసుకొని తినే ఆచారం ఉంది. ఈ రెండు అలవాట్లే భారతీయులను మరణ ప్రమాదం నుంచి కాపాడాయని అధ్యయనం వెల్లడించింది. తక్కువ జనాభా కలిగిన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, జనసాంద్రత ఎక్కువగా ఉన్న భారతదేశంలో మరణాల రేటు 5 నుంచి 8 రెట్లు తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. పసుపులో ఉండే కర్కుమిన్ కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో పోరాడే శక్తిని అందించింది. తద్వారా మరణాల రేటును తగ్గించింది. భారతీయులు ఐరన్, జింక్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ ఆహారమే కోవిడ్ 19 తీవ్రతను నివారించడంలో ముఖ్యపాత్ర పోషించిందని పరిశోధనలు నిరూపించాయి.