తాజా అన్నం కన్నా చద్దన్నమే ఆరోగ్యకరమా? ఒకప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చద్దన్నంగా మార్చి మరుసటి రోజు ఉదయం అల్పాహారంగా తినేవారు. ఉదయం పూట అన్నం తినే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. దీనివల్ల రాత్రి మిగిలిన అన్నంలోకి డస్ట్ బిన్లోకి వెళుతోంది. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం తాజాగా ఉదయం వండిన అన్నం కంటే రాత్రి మిగిలిపోయిన చద్దన్నమే చాలా ఆరోగ్యకరమైనది. తాజాగా వండిన బియ్యంతో పోలిస్తే రాత్రి వండిన అన్నం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే బరువు కూడా పెరగరు. కాబట్టి ఉదయం తింటే మంచిది. శరీరానికి శక్తి అందుతుంది. రాత్రి మిగిలిన అన్నంలో కాస్త మజ్జిగ కలిపితే ఉదయానికి పులుస్తుంది. దాన్ని తినడం వల్ల శరీరానికి ప్రోబయోటిక్ అందుతుంది. రాత్రి మిగిలిన అన్నంలో కాస్త మజ్జిగ కలిపితే ఉదయానికి పులుస్తుంది. దాన్ని తినడం వల్ల శరీరానికి ప్రోబయోటిక్ అందుతుంది.