ఇలాంటి నట్స్ వేయించుకునే తినాలి బాదం పప్పులు, పిస్తాలు, జీడిపప్పులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్... ఇలా చాలా రకాల నట్స్ ఉన్నాయి. అవిసె గింజలు, నువ్వులు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఇలాంటివి నేరుగా తినకూడదని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. వాటిని వేయించి లేదా నానబెట్టి తినాలి. అలా చేయకపోతే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. నట్స్‌పై ఫైటేట్లు ఉండవచ్చు. వీటివల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. అలా పేగు మార్గంలో అవి జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. జీర్ణ ప్రక్రియను కూడా ఇవి కష్టతరం చేస్తాయి. కాబట్టి ముడి విత్తనాలు తినడం మానేయాలి. రోజూ వేయించుకొని తినడం కష్టం అనుకుంటే ఎక్కువ మొత్తంలో వేయించుకుని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. కేవలం పెద్దలే కాదు పిల్లలకు కూడా నట్స్ తినడం అలవాటు చేయాలి. ఇవి వారి మెదడు మెరుగ్గా పనిచేసేందుకు ఎంతో సహకరిస్తాయి. ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఆరోగ్యానికి మరిన్ని పోషకాలు అందుతాయి.