వేసవిలోనే కుక్కలు ఎందుకు కరుస్తాయి?



వానాకాలం, శీతాకాలంలో కుక్క కాటు బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ వేసవిలో మాత్రం కుక్కలు కరుస్తాయి.



అంతవరకు బాగానే ఉన్న కుక్కలు అకస్మాత్తుగా మనుషుల మీద దాడి చేసి కండలు పీకేస్తాయి. ఎండాకాలంలోనే కుక్కలు ఇలా ప్రవర్తిస్తాయి.



మనుషుల మాదిరిగానే వేడి వాతావరణంలో కుక్కల స్వభావం కూడా మారుతుంది.



కుక్కల మానసిక పరిస్థితి వేసవిలో తేడాగా ఉంటుంది. అవి చాలా దూకుడుగా, కోపంగా కూడా ఉంటాయి.



వాటికి ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండవు. దీని వల్ల అది డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఇలా డీ హైడ్రేషన్‌కు గురైన కుక్క ఎవరినైనా కరిచే అవకాశం ఎక్కువ.



ఆడ శునకాల్లో లైంగిక హార్మోన్లు విడుదలవుతున్న సమయంలో కూడా అవి దూకుడుగా ప్రవర్తిస్తుంది.



కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి.



ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది.