రోజుకో కీరాదోస తింటే చాలు వేసవిలో రోజుకో కీరాదోస తినడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడవచ్చు. వేసవిలో దాహం తీర్చే పదార్థం కీరాదోస. దీనిలో 96శాతం నీరే. కీరాదోసలో ఉండే నీరు కిడ్నీలు, మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కీరాదోసలు తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య రాదు. దోసకాయ నిండా పోషకాలు ఉంటాయి. ఇది తింటే ఆహారం జీర్ణం అవుతుంది. బరువు పెరగకుండా చూడడంతో పాటూ మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు.