అల్లం అధ్భుతంగా పని చేస్తుంది.

ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తలనొప్పిని తగ్గించేస్తాయి. అల్లం టీ తాగితే మంచి రిలీఫ్ దొరుకుతుంది.

కాసేపు కునుకు ఆరోగ్యానికి చాలా మంచిది.

తలనొప్పి తగ్గించడంలో కాసేపు కునుకు కీలక పాత్ర పోషిస్తుంది. మైండ్ ని రిలాక్స్ చేస్తుంది.

కోల్డ్ కంప్రెస్ పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది.



కాసేపు తలకి బామ్ రాసుకుని సున్నితంగా మర్దన చేసుకుంటే రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది.

యోగా, మెడిటేషన్ మైండ్ ని రిలాక్స్ చేసి తలనొప్పిని అదుపులోకి తీసుకొస్తాయి.

కాఫీ లేదా టీ తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులోని కెఫీన్ వల్ల నరాలు విశ్రాంతి మోడ్ లోకి వెళతాయి.

తలనొప్పిగా అనిపించినప్పుడు ఫోన్, టీవీ అసలు చూడకూడదు.

తలనొప్పిగా అనిపిస్తే కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ వాటికంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే చిటికెలో నొప్పి తగ్గిపోతుంది.