నోరు మంట తగ్గడం లేదా? పుండ్లు వచ్చి ఆహారం తినలేక అల్లాడిపోతున్నారా?

శరీరానికి సరిపడా విటమిన్ డి అందకపోతే దాని వల్ల బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ కి దారితీస్తుంది.

ఈ వ్యాధి చాలా బాధాకరం. నోటిలో మంట, జలదరింపుగా అనిపిస్తుంది. ఇది కొన్ని రోజులు లేదా నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటుంది.

విటమిన్ డి లేకపోవడం వల్ల బలహీనమైన ఎముకలు, కండరాల తిమ్మిరి, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సూర్యరశ్మి విటమిన్ డి ఇచ్చే సహజ మూలం. అందుకే వైద్యులు పొద్దునే కనీసం ఒక అరగంట పాటు ఆరుబయట నిలబడితే మంచిదని సూచిస్తున్నారు.

డాక్టర్ సూచనల మేరకు మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటిని అతిగా వాడితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది

కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, పెరుగు వంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది.

విటమిన్ డి శరీరానికి కాల్షియాన్ని గ్రహించి ఎముకలు బలంగా మారేలా దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

విటమిన్ డి లోపం నుంచి బయట పడేందుకు ఓరల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

Image Credit: Pexels