జుట్టు పెరగాలంటే మొలకెత్తిన గింజలు తినండి



మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు, అందంపరంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి.



పెసర్లు, ఉలవలు, కొమ్ముశెనగలు, నువ్వుల గింజలు, పొద్దుతిరుగుడు గింజలు... ఇలా అనేక రకాల విత్తనాలు మొలకలుగా మార్చుకోవచ్చు.



వీటిని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందుతాయి.



వీటిని తినడం వల్ల జుట్టు ఊడిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి.



వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.



శరీరంలో చెడుకొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.



డయాబెటిస్ రోగులు రోజూ మొలకెత్తిన గింజలు తినడం అవసరం.



బరువు తగ్గాలనుకునేవారికి ఈ గింజలు ఎంతో సహకరిస్తాయి.



క్యాన్సర్ ను అడ్డుకునే సమ్మేళనాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.