పచ్చి మామిడితో డయాబెటిస్ అదుపులో



దీనిలో విటమిన్లు, మినరల్స్ డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.



మామిడి పండే కాదు, మామిడి కాయ తినడం కూడా అవసరం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముందుంటుంది.



మధుమేహంతో బాధపడే రోగులు సీజనల్‌గా దొరికే పచ్చి మామిడికాయల్ని తినడం చాలా అవసరం.



దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ రోగం అదుపులో ఉంటుంది.



రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలోనూ, తగ్గించడంలోనూ పచ్చి మామిడికాయ చాలా సహకరిస్తాయి.



కాబట్టి వేసవిలో ప్రతిరోజూ పచ్చిమామిడి ముక్కలను తినడం అవసరం.



మామిడిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణ సవ్యంగా జరగడానికి అవసరం.



రక్తప్రసరణ సవ్యంగా జరగడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.