మిస్ ఇండియాగా పంతొమ్మిదేళ్ల అందం భారతీయ సౌందర్య ప్రపంచంలో కొత్త అందం మెరిసింది. 59వ ఫెమినా మిస్ ఇండియాగా నందిని గుప్తా నిలిచింది. నందిని గుప్తా రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందినది. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని పూర్తి చేసింది. పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎప్పటికైనా మిస్ ఇండియా అవ్వాలని ఆశ పడింది. 19 ఏళ్ల వయసులో ఆ కోరికను నెరవేర్చుకుంది. ఆ ప్రయాణంలో ఎన్నో చేదు అనుభవాలు, ఛీత్కారాలు, ఎదురుదెబ్బలు తగులుతాయని ఆమెకు తెలుసు. ఎంతో మంది బంధువులు, స్నేహితులు విమర్శించినా తన కల నెరవేర్చుకోవడం పైనే ఆమె దృష్టి పెట్టింది. ఈమె త్వరలో మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం తరుపున పాల్గొనబోతోంది. మిస్ ఇండియాగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఈమె పాల్గొననుంది.