ముద్దు పెట్టుకుంటే వచ్చే వ్యాధి ఇది ముద్దు పెట్టుకుంటే వచ్చే వ్యాధిని ‘ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోస్సిస్’ అని సైన్స్ పరంగా పిలుస్తారు. ఇది ఎప్స్టీన్-బార్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ లాలాజలంలో ఉంటుంది. లాలాజలం ముద్దు పెట్టుకున్నప్పుడే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఎక్కువ, కాబట్టి దీనికి కిస్సింగ్ డిసీజ్ అని పేరు పెట్టారు. పిల్లల్ని ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. అందుకే వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో అలసట, జ్వరం, టాన్సిల్స్ వాపు, గొంతు మంట, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటివి వస్తాయి. ఈ ముద్దు వ్యాధి బారిన పడిన వారు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ శాతం ద్రవాలు తాగాలి. సరైన విశ్రాంతి, మందులు వాడకపోతే ఈ లక్షణాలు ఆరు నెలల వరకు కొనసాగే అవకాశం ఉంది.