మామిడిపండు తినేముందు నీటిలో ఎందుకు నానబెట్టాలి? వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్లు మార్కెట్లలో దర్శనమిస్తాయి. వాటిని తినేందుకు ప్రజలు వేసవి కాలం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టాలని చెబుతారు పోషకాహార నిపుణులు. అలా ఎందుకు నానబెట్టాలో చాలామందికి తెలియదు. మామిడిపండ్లలో ఉత్పత్తి అయ్యే అదనపు ఫైటిక్ ఆమ్లం తొలగించడానికి నీళ్లలో నానబెట్టాలి. వివిధ కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి వాటిలో ఈ ఫైటికి యాసిడ్ ఉంటుంది. ఇలా నానబెట్టడం వల్ల అవి విచ్ఛిన్నమైపోతుంది. ఈ ఫైటిక్ యాసిడ్లు అదనపు వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. నీటిలో నానడం వల్ల ఈ అదనపు వేడి కూడా తగ్గిపోతుంది. నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి తొక్కపై ఉండే కనిపించని నూనె తొలగిపోతుంది. అది కొందరిలో ఎలర్జీలు కలిగించే అవకాశం ఉంది. తొక్కపై ఉండే పాలీఫెనాల్స్, టానిన్లు వంటివి శరీరంలో చేరితే దురద, బొబ్బలు రావడానికి కారణం అవుతుంది. ఇలా మామిడిపండ్లు నానబెట్టడం వల్ల అవన్నీ బయటికి పోతాయి. పండు తినడానికి సురక్షితంగా మారుతుంది.