పప్పులు నానబెట్టిన నీళ్లను ఇలా వాడండి



నట్స్, పప్పులు వంటివి నీళ్లలో నానబెట్టడం అనేది ప్రతి ఇంట్లో సాధారణంగా పాటించే పద్ధతే.



అయితే నానబెట్టిన ఆ నీళ్లను చాలామంది బయట పడేస్తారు. అదే తప్పని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.



పప్పులను నానబెట్టాక ఆ నీటిని తిరిగి వాడడం ఎంతో ఉత్తమమైన పద్ధతని, అది ఆరోగ్యానికి మంచిదని వివరిస్తున్నారు.



పప్పులు, ధాన్యాలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. నీళ్లలో ముందుగా నానబెట్టడం వల్ల అది శరీరం గ్రహించడానికి వీలుగా విచ్చిన్నమవుతుంది.



పప్పును నానబెట్టిన నీళ్లలో బి విటమిన్లు ఉంటాయి. వాటిని తిరిగి పప్పును ఉడికించడానికి లేదా అన్నాన్ని ఉడికించడానికి ఉపయోగించుకుంటే మంచిది.



పప్పులు నానబెట్టి వండడం వల్ల సులభంగా ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే పోషకవిలువలు పెరుగుతాయి.



అంతేకాదు పప్పులు ముందుగా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది.



పప్పులను రెండు మూడు సార్లు కడిగిన తరవాతే, మంచి నీళ్లలో నానబెట్టాలి.