వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం ఉపయోగపడే అత్యుత్తమ పానీయం కొబ్బరి నీళ్ళు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కొబ్బరి నీళ్ళలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్ల అద్భుతమైన మూలం.

తియ్యగా ఉండే ఈ నీళ్ళు తాగితే నిర్జలీకరణ బారిన తక్కువ పడతారు. చెమట కారణంగా కోల్పోయిన ద్రవాలని తిరిగి నింపడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నీళ్ళలో సహజంగా శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి.

కొబ్బరి నీళ్ళలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

హీట్ వేవ్ సమయంలో ఇది చాలా ముఖ్యమైనది. వేడి ఒత్తిడి కారణంగా శరీరం అనారోగ్యం, ఇన్ఫెక్షన్ కు ఎక్కువ అవకాశం ఉంటుంది.

కొబ్బరి నీళ్ళలో కేవలం 48 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కొవ్వు శాతం సున్నా.

జీర్ణక్రియ, జీవక్రియని పెంచడంలో సహాయపడే బయో యాక్టివ్ ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. రోజుకి 3-4 సార్లు కొబ్బరి నీటిని తాగొచ్చు.

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పొడి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. నేరుగా దీన్ని ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు.

కొబ్బరి నీళ్ళలో 94 శాతం నీరు ఉంటుంది. చర్మం పొడిబారినట్లయితే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. మొటిమలు తగ్గించేస్తుంది.