మట్టిపాత్రలో వంట చేసేముందు ఈ జాగ్రత్తలు తప్పవు



పూర్వం మట్టి కుండలోనే వంట చేసేవారు. కాలం మారుతున్న కొద్దీ ఆ ఆచారం కనుమరుగైపోయింది.



ఆహారాన్ని వండడానికి మట్టికుండలను ఉపయోగించడం అనేది నిజంగా ఒక సురక్షితమైన పద్ధతి.



మట్టి కుండలో ఉండడానికి ఎక్కువ నూనె అవసరం లేదు కాబట్టి భోజనం ఆరోగ్యకరంగా ఉంటుంది. మట్టికుండల్లో హానికరమైన రసాయనాలు ఏమీ ఉండవు.



మట్టికుండను మొదటిసారి ఉపయోగించేముందు దానిని నీటితో నింపి కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వండాలి.



మట్టి కుండల మీద వండేటప్పుడు చిన్న మంట మీద వండాలి. అధిక వేడిని, అధిక మంటను అవి తట్టుకోలేకపోవచ్చు.



మట్టి పాత్రలో ఆహారాన్ని కలపడానికి స్టీలు గరిటెలు ఉపయోగించకూడదు. అడుగు భాగం దెబ్బతింటుంది.చెక్క గరిటెలను, సిలికాన్‌తో చేసిన గరిటెలను వాడవచ్చు.



వీటిని సున్నితమైన మెత్తని స్క్రబ్బర్‌తో మెల్లగా తోమాలి. తర్వాత కాటన్ క్లాత్ తో తుడిచేయాలి.



మట్టికుండను సూర్యకాంతిలో ఆరబెట్టడం వల్ల దాని నుంచి తేమ త్వరగా తొలగిపోతుంది.