వేరుశెనక్కాయలు తినడం వల్ల లాభాలు ఎన్నో వేరుశెనగలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, విటమిన్ 6 వంటి పోషకాలు ఉన్నాయి. అధ్యయనం ప్రకారం రోజూ గుప్పెడు వేరుశెనగలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ అధికం. ఇవి చర్మానికి మెరుపును అందిస్తాయి. వేరుశెనగల్లో ఎల్-అగ్రినైన్ అని పిలిచే పదార్థం ఉంటుంది. దీని వల్ల జుట్టు పెరుగుదల ఉంటుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. పిల్లలకు గుప్పెడు వేరుశెనగలు తినడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా చేరుతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కవగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉండే వీటిని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. యాంగ్జయిటీని, మూడ్ స్వింగ్స్‌ను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.