కంటి శుక్లాలు ఎవరికి వస్తాయి? కంటి శుక్లాలు వచ్చినప్పుడు సకాలంలో చికిత్స అందించకపోతే కంటి చూపు పోవడానికి కారణం అవుతుంది. మారుతున్న కాలంలో యువత కూడా కంటిశుక్లాలు బారిన పడే అవకాశం ఉంది. కంటి శుక్లాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వాటితో బాధపడాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు అంచనా. వృద్ధుల్లో ఈ కంటి శుక్లాలు వచ్చే అవకాశం ఎక్కువ. గ్లాకోమా వంటి వ్యాధుల బారిన పడే వారిలో కూడా కంటి శుక్లాలు వస్తాయి. మధుమేహం ఉన్నవారిలో కూడా కంటికి ఏమైనా గాయాలు అయితే కంటి శుక్లంగా మారే అవకాశం ఉంది. కంటి శుక్లాలు ముదిరిపోతే మరలా చూపు రావడం కష్టతరంగా మారొచ్చు.