ఇనుప కళాయిలో వండకూడని పదార్థాలు ఇవే పూర్వం ఇనుప కళాయిలో వండితే, ఇనుము లోపం శరీరానికి రాకుండా ఉంటుందని అనేవారు. ఇప్పుడు రకరకాల కళాయిలు అందుబాటులోకి వచ్చాయి. ఇనుపకడాయిలో అన్ని రకాల వంటలు ఉండకూడదు. అని కొన్ని రకాలు వండడం వల్ల రుచి మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు పోషకాహార నిపుణులు. టమోటాలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. వీటిని ఇనుప కళాయిలో వండకూడదు. చింతపండు ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. దీన్ని ఇనుపకళాయిలో వండినప్పుడు నోటికి లోహపు రుచిని ఇవ్వడం వంటివి చేస్తుంది. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇనుపకళాయిలో దీన్ని వండినప్పుడు రంగు నలుపుగా మారుతుంది. నిమ్మకాయలో కూడా అధిక ఆమ్లత్వం ఉంటుంది. దీన్ని ఐరన్ కళాయిలో వేసినప్పుడు ఆహారం రుచి చేదుగా మారే అవకాశం ఉంది. బీట్రూట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. ఇనుప కళాయిలో బీట్రూట్ వండడం వల్ల రంగు మారిపోతుంది. మిగతా కూరలను, వంటకాలను మాత్రం ఇనుప కళాయిలో వండుకోవచ్చు. పుల్లని కూరగాయలేవీ దీనిలో వండకూడదు.