ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది ఈ బనానా కాఫీ. పాలు లేకుండా తయారు చేయబడే పానీయం ఇది.

కేవలం రెండు పదార్థాలతో సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ చేసిన అరటిపండు, తాజాగా తయారు చేసిన బ్లాక్ కాఫీ ఉంటే చాలు.

అరటిపండులో డైటరీ పైబర్ తో పాటు మల్టిపుల్ మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి.

తీపి, క్రీమ్ రుచిగా ఉండటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

ఈ బనానా కాఫీని తయారు చేయడానికి కావలసిందల్లా రెండు ఫ్రొజెన్ అరటిపండ్లు, ఒక కప్పు కోల్డ్ డ్రిప్ కాఫీ.

ఈ కాఫీలో అరటిపండ్లు బాగా కరిగే వరకు కలపాలి. పండిన అరటిపండ్లు తియ్యగా ఉంటాయి. కాబట్టి అందులో స్వీటేనర్లు వేసుకోవాల్సిన అవసరం లేదు.

అరటి కాఫీ రుచిని బాగుండాలంటే వెనీలా ఎక్స్ ట్రాక్ట్, నట్ బటర్, దాల్చిన చెక్క, జాజికాయ, కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు.

అరటిపండు కలపడం వల్ల ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది.

అరటిపండులోని ఫైబర్ గుణాలు మలబద్ధకం సమస్యని పోగొడతాయి.

Image Credit: Pixabay/ Pexels