బర్గర్‌ను చుట్టే పేపర్ ఎంత ప్రమాదమో తెలుసా?



మీరు ఎప్పుడైనా తినేటప్పుడు గమనించారా... బర్గర్ చేతికి అంటకుండా ఒక పేపర్ పై పెట్టి ఇస్తారు.



అది జస్ట్ పేపరే కదా అని అనుకుంటాం, కానీ భయంకరమైన రోగాలను తీసుకొచ్చే సాధనం.



అది నిజానికి పూర్తిస్థాయి కాగితం కాదు, ప్లాస్టిక్ కలిసిన కాగితం. దానివల్ల మానవ ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికీ హానికరం.



ఈ విషయాన్ని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఒక అధ్యయనంలో తేల్చింది. అలాంటి పేపర్లను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.



దీనిలో పెర్ఫ్లూరోక్టానోయిక్ సల్ఫేట్ (PFOS) అనే రసాయనం ఉంటుంది. ఇవి నెమ్మదిగా విచ్ఛిన్నం అవ్వడం మొదలవుతాయి.



కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ప్యాకేజింగ్ ద్వారా ఆహారానికి అంటుకుంటాయి. అవి మీ శరీరంలోకి చేరడం చాలా సులువు అని వివరిస్తున్నారు అధ్యయనకర్తలు.



కాగితం నుంచి ఆ కణాలు ఆహారానికి అతుక్కుని పొట్టలోకి చేరుతాయి. దీని వల్ల కాలేయానికి ఎంతో హాని.



ప్రమాదకరమైన క్యాన్సర్లకు, సంతానోత్పత్తి కాకుండా అడ్డుకోవడానికి, ఊబకాయానికి ఇవి కారణం అవుతాయి.