బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? బియ్యం, పప్పులు ఎక్కువ కాలం పాటు ఇంట్లోనే ఉంటే వాటికి పురుగులు పట్టేస్తాయి. చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. పసుపు కొమ్ములు లేదా పసుపు పొడి కలపాలి. బిర్యానీ ఆకులను బస్తాలో ఉంచాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను బియ్యంలో కలపాలి. మిరియాల పొడి, మిరియాలు బియ్యంలో వేయాలి. లవంగాలను బియ్యంలో వేయాలి. అగ్గి పెట్టె తెరిచి బియ్యం బస్తాలో పెట్టాలి.