ఇంట్లోనే మ్యాంగో ఐస్‌క్రీమ్


కొబ్బరిపాలు - అరలీటరు
మామిడి పండు - ఒకటి
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను
మాఫుల్ సిరప్ - అరకప్పు


మామిడి పండ్లు గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి.

కొబ్బరిపాలు, వెనిల్లా ఎసెన్స్ వేసి బ్లెండర్లో బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని మామిడి పండ్లు గుజ్జున గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి.

మాపుల్ సిరప్‌ను కూడా మామిడి గుజ్జులో వేసి బాగా కలపాలి.

ఐస్ క్రీమ్ మౌల్డ్ లో వీటిని వేయాలి.

నాలుగ్గంటల పాటూ ఫ్రీజర్లో ఉంచితే మ్యాంగ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.