అరటి పండును ఉడకబెట్టి తింటే ఆరోగ్యమా?



సోషల్ మీడియాలో అరటి పండ్లను ఉడికించి తింటున్న రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి.



మన భారతదేశంలో అరటిపండును ఉడికించి తినడం అనేది అలవాటు లేదు. కానీ విదేశాల్లో మాత్రం ఇది వాడుకలో ఉన్న పద్ధతే.



అరటి పండును తొక్కతోపాటు ఐదు నుండి పది నిమిషాలు నీళ్లలో ఉడకబెడతారు. అలా ఉడకబెట్టాక అరటిపండు మరింత మృదువుగా, తీయగా, క్రీమ్ ‌లా మారుతుంది.



ఆ అరటిపండు పై తేనె చల్లుకొని, పీనట్ బటర్ పూసుకొని తింటూ ఉంటారు.



పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటిపండును ఉడకబెట్టడం వల్ల అందులోని పోషకాలు పెరుగుతాయి.



ఉడకబెడుతున్నప్పుడు వచ్చే వేడి అరటిపండు తొక్కలోని గోడలను విచ్ఛిన్నం చేస్తుంది. అందులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అరటి పండులోని గుజ్జు లాక్కుంటుంది.



ఉడకబెట్టడం వల్ల అరటిపండు లో ఉండే పిండి పదార్థం పెరుగుతుంది. ఇది స్థిరమైన శక్తిని మన శరీరానికి అందిస్తుంది.



ఇలా ఉడకబెట్టిన అరటిపండును తినడం వల్ల చక్కెర కలిపి పదార్థాలను తినాలన్న కోరిక తగ్గుతుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ కు దూరంగా ఉంచుతుంది.