ఆరోగ్యమైన కొన్ని ఆహారాలే గుండెకి హాని చేస్తాయి. అటువంటి వాటిని అసలు తీసుకోకపోవడమే మంచిది. స్పైసీగా, క్రంచీ గా ఉండే రుచికరమైన చిప్స్ ఊబకాయానికి దారి తీస్తాయి. రక్తపోటుని పెంచుతాయి. సాసేజ్ లు ఆరోగ్యకరమైన ఎంపికని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు కాదు. కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను పెంచుతాయి. ఎక్కువ ప్రోటీన్లు తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 33 శాతం పెంచుతుంది. కొబ్బరి నూనె గుండెకి ఆరోగ్యకరమైన ఎంపికని భావిస్తారు. కానీ ఇది సంతృప్త కొవ్వులతో నిండి ఉంటుంది. ధమనుల్లో అడ్డంకులను కలిగిస్తుంది. తక్షణ శక్తినిచ్చే డ్రింక్స్ కృత్రిమ రుచులు, చక్కెర, కెఫీన్ అధికంగా కలిగి ఉండటం వల్ల గుండె సమస్యలు, అరిథ్మియా, రక్తపోటుని ప్రేరేపిస్తాయి. అతిగా తినడం వల్ల బరువు పెరగడం, స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్ కి దారి తీస్తుంది. ఇవన్నీ గుండెకి హాని కలిగించేవి. ఆల్కహాల్ అన్నింటికంటే ప్రమాదరకరమైంది. ఈ అలవాటు తప్పనిసరిగా మానుకోవాలి. Image Credit: Pixabay/ Pexels