వేసవిలో కచ్చితంగా తినాల్సినవి ఇవే వేసవిలో ఆహారం తింటూ సులువుగా బరువు తగ్గొచ్చు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వేసవి సీజనల్ పండ్లయినా పుచ్చకాయలు, మామిడి, బెర్రీలు కచ్చితంగా తినాలి. వాటిలో నీటి శాతం కూడా ఎక్కువ. పైనాపిల్, పీచెస్ వంటివి మన శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అవి తినడం వల్ల అందే క్యాలరీలు తక్కువే. కొవ్వు శాతం సున్నా. సత్తు పిండితో చేసే పానీయం వేసవిలో కచ్చితంగా తాగాల్సినది. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. పండ్లు లేదా కూరగాయలతో చేసిన సలాడ్‌ను రోజూ తినాలి. ఇది తేలికపాటి ఆహారం. శక్తిని మాత్రం అందిస్తుంది. టీ, కాఫీలకు బదులు ఐస్ కాఫీలు, టీలు తాగడం మంచిది. ఇవి మూడ్‌ను కూడా మారుస్తాయి. శరీరంలో ఉత్సాహాన్ని నింపుతాయి. వేసవిలో కొబ్బరినీళ్ళకు మించిన ఔషధం లేదు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకో కొబ్బరి బోండం తాగిన చాలు, రోజంతా శరీరంలో వేడి పెరగకుండా అడ్డుకోవచ్చు.