హెల్తీ రాగి కేక్ - చేయడం చాలా సులువు



రాగి పిండి - ఒకటిన్నర కప్పు
నీళ్లు - ముప్పావు కప్పు
పెరుగు - అరకప్పు
బేకింగ్ పౌడర్ - ఒక స్పూన్
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను
కోకో పౌడర్ - ఒక స్పూన్



వెజిటబుల్ ఆయిల్ - మూడు స్పూన్లు
బటర్ - ఒక స్పూను
బేకింగ్ సోడా - ఒక స్పూను
ఉప్పు - ఒక స్పూను
పంచదార పొడి - మూడు స్పూన్లు



ఒక గిన్నెలో పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార పొడి, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి.



పది నిమిషాలు తర్వాత ఆ మిశ్రమంలో రాగి పిండి, కోకో పౌడర్, వెజిటబుల్ నూనె వేసి మందంగా వచ్చేలా కలపాలి.



మరీ మందంగా అనిపిస్తే కొద్దిగా నీరు వేసి పిండిని రెడీ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.



కేకు మౌల్డ్ తీసుకొని దాని అడుగు భాగానికి బటర్ రాయాలి. తరువాత పార్చ్‌మెంట్ పేపర్ వేయాలి.



ముందుగానే ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ వద్దకు ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసిన ఆ ఓవెన్లో అరగంట పాటు కేక్ మౌల్డ్‌ని ఉంచాలి.



ఆ తరువాత టూత్ పిక్‌తో గుచ్చి చూడాలి. టూత్ పిక్‌కు ఏమీ అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే.