బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందా? బొప్పాయి పండు తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందని ఎంతోమంది నమ్మకం. ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. పచ్చి బొప్పాయిని తినడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది. పచ్చి బొప్పాయిలో పపాయన్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఏర్పడతాయి. పచ్చి బొప్పాయిని లేదా సగం పండిన బొప్పాయిని మాత్రం గర్భిణీలు తినకూడదు. తినాలనిపిస్తే బాగా మగ్గిన పండును తేనెతో కలిపి తింటే ఈ ఎంజైమ్ ప్రభావం తగ్గుతుంది. పూర్వం నుంచి బొప్పాయి గర్భస్రావానికి కారణం అవుతుందని నమ్ముతూనే ఉన్నారు. ఇది నిజం కూడా. ప్రాచీన కాలంలో ఈజిప్టులో బొప్పాయి గింజలను ఉపయోగించి తమ దగ్గర ఉండే ఒంటెలను గర్భం ధరించకుండా చేసేవారట. అలా బొప్పాయికి గర్భస్రావం చేసే శక్తి ఉన్నట్టు ప్రచారం మొదలైంది.