మగవారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ప్రొస్టేట్ క్యాన్సర్. దాన్ని ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



ప్రొస్టేట్ అనేది మగవారికి మాత్రమే ఉంటుంది. పునరుత్పత్తిలో ఇదొక భాగం. మూత్రాశయం కింద ఉంటుంది.



ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం చక్కగా పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

సెలీనియం అధికంగా ఉండే ఆహారాలతో పాటు రంగు రంగుల మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకుంటే మంచిది.



సెలీనియం తెల్ల మాంసం, చేపలు, షెల్ఫిష్, గుడ్లు, గింజల్లో కనిపిస్తుంది.
సహజంగా లైకోపీన్ టమోటాలు, సీతాఫలాలు, ద్రాక్ష, పీచెస్, పుచ్చకాయలు, కాన్ బెర్రీస్ లో ఉంటుంది.


పెద్దలు రోజుకి 1 ½ కప్పు నుంచి 2 కప్పుల వరకు పండ్లు, 2 నుంచి 3 కప్పుల వరకు కూరగాయలు తింటే ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.



ప్రొస్టేట్ క్యాన్సర్ నిశ్శబ్ద క్యాన్సర్. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకి తగినట్టు ప్రభావితమవుతుంది.



నారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి వాటి వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.



ఆవుపాలలో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.